ప్రధాని పదవైనా వద్దు, జగన్ జెండా పీకేశాడు: కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణపై డ్రాఫ్ట్ బిల్లులో తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. తనకు ప్రధానమంత్రి పదవి ఇస్తానని చెప్పినా... తెలంగాణ తప్ప మరొకటి తమకు వద్దన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు సులభంగా పాస్ అవుతుందన్నారు. ప్రధాని పదవి, ముఖ్యమంత్రి పదవులు ముఖ్యం కాదని ప్రత్యేక రాష్ట్రం ముఖ్యమన్నారు.

తెరాస భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ చేతిలో హైదరాబాదు శాంతిభద్రతలు ఉంచడాన్ని తాము అంగీకరించమన్నారు. ప్రధానికి రాసిన లేఖలో తెలంగాణ ప్రజలకు అంగీకారం కాని అంశాలను ప్రస్తావించామన్నారు. నీటి పంపకాలు, ఉద్యోగుల పెన్షన్‌లపై న్యాయం జరగలేదని, నేటివిటీ ఆధారంగా ఉద్యోగులను, పెన్షనర్లను విభజించాలన్నారు. ఎక్కడ ఖర్చు అయితే ఆ రాష్ట్రమే భరించే విధంగా ఉండాలన్నారు.

K Chandrasekhar Rao

నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో ఉద్యోగాలు పొందిన వారి పెన్షన్లు భరించాలంటే భారం అవుతుందన్నారు. ఎవరు ఆపినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు. ఇంత దూరం వచ్చాక ఎవరి వల్ల కాదన్నారు. సీమాంధ్ర నేతలు విభజనకు సహకరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాహాటంగా విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. టిటిడిపి నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

తెలంగాణపై విషం చిమ్ముతున్న చంద్రబాబు కాళ్ల వద్ద టిటిడిపి నేతలు పడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగు తెలంగాణలో జెండా పీకేశారని, ఇంకా ఆ పార్టీలో ఎవరైనా ఉంటే తెలివి తక్కువతనమే అన్నారు. తెలంగాణలో జగన్ పార్టీ కథ ముగిసిందన్నారు. నాయకులు సీమాంధ్ర ప్రజలను వంచించకుండా ఏం కావాలో డిమాండ్ చేయాలన్నారు.

చంద్రబాబు వంటి లత్కోర్ నాయకులు ఉండరన్నారు. ఆయన ఎన్నిసార్లు మాటలు మారుస్తారని ప్రశ్నించారు. టిటిడిపి నేతలు ఇప్పటికైనా కళ్లు తెరిచి బయటకు రావాలన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. తెలంగాణను అఢ్డుకునేందుకు జగన్ దేశమంతా తిరుగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ కుర్చీకి అర్హుడే కారన్నారు. రాజ్యాంగంపై సిఎంకు అవగాహన లేదన్నారు. సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం ఉండదన్నారు.

జబర్దస్త్‌గా కలిసుండాలని డిమాండ్ చేసే హక్కు సీమాంధ్ర నేతలకు ఎక్కడిదన్నారు. సామరస్య పూర్వక విభజనకు ముందుకు రావాలని లేదంటే సీమాంధ్ర నేతలు వారి ఖర్మ వారు అనుభవించక తప్పదన్నారు. మనలో ఎవరం ఇక్కడ వెయ్యి సంవత్సరాలు బతికేందుకు రాలేదని, నేతలు విషబీజాలు నాటడం మానుకోవాలన్నారు. సీమాంధ్రులు ఆనాడు ఇలా వ్యవహరించడం వల్లనే రాజాజీ తమిళనాడు నుండి పంపించేశారని విమర్శించారు. సీమాంధ్రులు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. హైదరాబాదును ఖాళీ చేయాల్సి వస్తుందనే చంద్రబాబు బాధ అన్నారు.

అనంతపురం సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు. రేపో లేదా ఎల్లుండో అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని, తెలంగాణ బిల్లు అంటే అదేదో బ్రహ్మపదార్థం కాదని, ఈజీగా అది పాస్ అవుతుందన్నారు. తెలంగాణ బిల్లు పైన చర్చ మాత్రమే ఉంటుందని, తీర్మానం ఉండదని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు, ఇతర రాష్ట్రాల ఏర్పాటుకు వ్యత్యాసం ఉందని చెప్పారు.

రాష్ట్రం విడిపోక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. వలస సీమాంధ్రులు చేసిన తప్పు వల్లనే తెలంగాణ డిమాండ్ వచ్చిందన్నారు. సీమాంధ్రలో ప్రాజెక్టులు పూర్తయినా, తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. తమ డిమాండును కేంద్రం గుర్తించిందని, విడిపోయాక కూడా మంచిగా కలిసుందామన్నారు. అనవసర యాగీ చేయవద్దని సూచించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆమోదం ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరి వల్లా కాదన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఓడినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం పడిపోదని, విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+