అయ్యన్నతో విభేదాలు లేవు: మంత్రి గంటా స్పీష్టకరణ

విశాఖపట్నం: మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడితో తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు స్పష్టం చేశారు. అంకోశా హాలులో బుధవారం సాయంత్రం జరిగిన విశాఖ అర్బన్ జిల్లా తెలుగు మహిళా విభాగం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కూడా పాల్గొన్నారు.

తనకు అయ్యన్నపాత్రుడితో విభేదాలు ఉన్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు కేవలం అపోహలు మాత్రమేనని, తమ మధ్య అటువంటివేమీ లేవని, ఇద్దరం కలిసే పనిచేస్తున్నామని గంటా అన్నారు. కార్పోరేషన్ పదవుల పంపిణీలో ఉత్తరాంధ్రకు అవకాశం దక్కితే బాగుండేదని ఆయన అన్నారు.

No differences with Ayyanna patrudu: Ganta

త్వరలో జరిగే పదవుల పంపకంలో విశాఖకు ప్రాతినిధ్యం ఉండేలా తామిద్దరం కృషి చేస్తామని ఆయన చెప్పారు. నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరుగుతోందని కొందరు భ్రమపడుతున్నారని, అందరూ కలిసి అర్హుల పేర్లు చెప్తే నియమిస్తామని ఆయన చెప్పారు.

విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు జనరల్ సీట్లలో కూడా మహిళలకు అవకాశం కల్పించాలని గంటా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+