బాబుతో విభేదాలపై బాలకృష్ణ: 'లెజెండ్'కి లేని ఆహ్వానం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని ఆ పార్టీ నేత, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. బాలకృష్ణను కేవలం ప్రచారాల కోసమే వాడుకుంటున్నారు తప్ప పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదంటూ బాలయ్య రాష్ట్ర అభిమానుల సంఘం అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన బాలకృష్ట గురువారం మాట్లాడుతూ తనకు చంద్రబాబుకు మధ్య ఎలాంటి విబేధాలు లేవన్నారు. అదే సమయంలో 'లెజెండ్' చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకకు చంద్రబాబుకు ఆహ్వానం లేదనే వార్తలపై స్పందించారు. 'లెజెండ్' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అభిమానులు గొడవ చేస్తారనే ఉద్దేశంతో చంద్రబాబును ఆహ్వానించలేదన్నారు.

ఈ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలన్నారు. ఆడియో కార్యక్రమంలో ఎలాంటి గొడవలు చేయవద్దని బాలకృష్ణ అభిమానులను కోరారు. కాగా, టిడిపి నేతలు కూడా బాలకృష్ట చేసిన వ్యాఖ్యలను బలపరిచారు. వారిద్దరి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, బాలకృష్ణ సినిమాల ఆడియో రిలీజ్ కార్యక్రమాలకు ఎప్పుడు చంద్రబాబు హాజరుకాలేదని చెప్పారు.
బాలకృష్ణ లెజెండ్ ఆడియో ఫంక్షన్‌కు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందలేదట. కాగా, బాలకృష్ణను ప్రచారానికి వాడుకోవడమే తప్ప ఎలాంటి ప్రాధాన్యమైన పదవులు ఇవ్వడం లేదని బాలయ్య అభిమానులు ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications