యువకుడిపై కత్తితో యువతి దాడి, మాట్లాడుదామని చెప్పి అటాక్.. ఎందుకో తెలుసా..?
కలికాలం అంటే ఇదేనెమో.. ప్రేమ, పెళ్లి పేరుతో దాడులు జరుగుతున్న ఘటనలు చూశాం. కానీ కృష్ణా జిల్లాలో ఓ యువతి.. యువకుడిపై దాడి చేసింది. ఇంతకీ ఎందుకు అటాక్ చేసిందో.. తెలుసా.. పెళ్లి చేసుకోవడం లేదు అని.. కసితో అటాక్ చేసింది. దీంతో ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. తర్వాత యువతి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది.. కానీ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.

మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంకు చెందిన యువతి మాగంటి నాగలక్ష్మి ఆర్కే కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈమెకు గూడూరు గ్రామానికి చెందిన గొరిపర్తి పవన్ కుమార్‌తో రెండేళ్ల నుంచి పరిచయం ఉంది. ఇతను పెడన తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి మధ్య పెళ్లి చేసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ అందుకు కుమార్ అంగీకరించలేదు.
పెళ్లి పేరు చెబితే తప్పించుకుంటున్నారని.. చివరిసారిగా మాట్లాడుదామని చల్లపల్లి మండలం వక్కలగడ్డకు పిలిపిచింది. అక్కడ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఒప్పుకోలేదు. అప్పటికే తనతో తీసుకొచ్చిన కత్తితో యువతి దాడికి తెగబడింది. అక్కడినుంచి పారిపోయిన యువకుడు పోలీసులకు సమాచారం అందజేశారు. తర్వాత యువతి నిద్రమాత్రలు మింగి.. సూసైడ్ అటెంప్ట్ చేసింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో.. ప్రాణాలతో బయటపడింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications