ఖరీఫ్‌కు నీటి విడుదల, ఇరిగేషన్ క్యాలెండర్ తో పోలవరం డెడ్‌లైన్ ఫిక్స్!

ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం, శంకుస్థాపనలు చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో 25 ఇరిగేషన్ ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ ను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం రాష్ట్ర సచివాలయంలో పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. దీంట్లో భాగంగా ఇరిగేషన్ క్యాలెండర్ అంశంపై చర్చించారు.

గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా...ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఆ మేరకు ఆ 11 ప్రాజెక్టులను ఇరిగేషన్ క్యాలెండరులో చేర్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను సూచించారు. గతంలో ప్రకటించిన 25...సమీక్షలో ప్రకటించిన 11 ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకుని ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ కు అనుగుణంగా పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

No More Kharif Delays CM Naidu Outlines Micro-Irrigation Blueprint to Reduce State Power Subsidy Burdens

ప్లాన్ ప్రకారమే పోలవరం పనులు..

సమీక్షా సమావేశం సందర్భంగా పోలవరం సహా వివిధ సాగు నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88 శాతం పూర్తి అయ్యాయని అధికారులు వెల్లడించారు. భూసేకరణ 93 శాతం పూర్తైందని...నిర్వాసితుల తరలింపు 45 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తి అవుతాయని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. పోలవరం కుడి కాలువను అనుసంధానించే ట్విన్ టన్నెల్స్ పనులు 85 శాతం పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. ఎడమ కాలువ అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్ పనులను చేపడుతున్నట్టు వెల్లడించారు.

కోస్తా ఆంధ్రాకు వరద గండం! ఎల్ నినో సృష్టించనున్న వాతావరణ బీభత్సం
కోస్తా ఆంధ్రాకు వరద గండం! ఎల్ నినో సృష్టించనున్న వాతావరణ బీభత్సం

పోలవరం ప్రాజెక్టుతో పాటు.. వివిధ ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. హంద్రినీవా ఫేజ్ 1 లో భాగంగా కాలువల వెడల్పు 92 శాతం పూర్తి అయ్యిందని అధికారులు చెప్పారు. ఫేజ్ 2 కుప్పం- పుంగనూరు కాలువల లైనింగ్ 85 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. మల్యాల లిఫ్ట్ నుంచి రాయలసీమ ప్రాంతానికి తొలిసారిగా 52 టీఎంసీల నీటిని తరలించామని చెప్పారు. మొత్తంగా 432 చెరువులు పూర్తిగా నింపామని వెల్లడించారు. జూన్ 2024 నుంచి ఇప్పటి వరకూ రూ.2123 కోట్లు వ్యయం చేశామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...

"ప్రతీ నెలా పోలవరం పనుల పురోగతిపై సమీక్షిస్తాను. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్-1,2 పనులు చెప్పిన సమయానికి పూర్తి చేయాల్సిందే. ఈ ఏడాది జూలై నెల నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువ నుంచి నీరు అందివ్వాలి. ఎడమకాలువ నీరు మేఘాద్రిగడ్డకు పోలవరం జలాలు తీసుకువెళ్లాక అక్కడి నుంచి వంశధార-నాగావళి-చంపావతి వరకూ నీరు వెళ్లేలా చూడాలి. మేఘాద్రి గడ్డ నుంచి చంపావతి లింక్ కు ఎంత వ్యయం అవుతుందో అధ్యయనం చేయాలి. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో చట్టప్రకారం ముందుకు వెళ్లాలి. 2027 ఏప్రిల్ నాటికి నిర్వాసితుల తరలింపును పూర్తి చేయాలి. ఎలాంటి వివాదాలు లేకుండా ఆర్ అండ్ ఆర్ వేగంగా పూర్తి కావాలి. పోలవరం స్పిల్ వే దిగువన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. బెస్ట్ టూరిజం ప్రాంతంగా పోలవరం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కావాలి." - సీఎం చంద్రబాబు నాయుడు,


ఖరీఫ్ కు నీరు.. ముఖ్యమంత్రి దిశానిర్దేశం

ఎల్ నినో లాంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు అంచనాలను సిద్ధం చేసుకుంటూ పంటలు వేసేలా రైతులను సమాయత్తం చేయాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు సాగు తీరును మార్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసారి రెయిన్ ఫాల్ మైనస్ 3 శాతంగా, భూగర్భ నీటి నిల్వలు 9.49 మీటర్లుగా ఉన్నాయి..గతేడాదితో పోలిస్తే 0.5 మీటర్లు ఎక్కువ ఉందని సీఎం వివరించారు. ప్రస్తుత నీటి వనరుల్ని నింపేలా స్ట్రక్చర్ల నిర్మాణం జరగాలని పేర్కొన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశ చేశారు.

రెండున్నరేళ్ల పాటు కరువే! ఎల్‌నినో వచ్చేసింది!
రెండున్నరేళ్ల పాటు కరువే! ఎల్‌నినో వచ్చేసింది!

సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండాలి. నీటి భద్రత అత్యంత కీలకమనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. కృష్ణా డెల్టాలో గతంలో ఆలస్యంగా సాగు సీజన్ ఉండేది. తుపాన్లు ప్రభావం వల్ల పంటనష్టానికి పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. పట్టిసీమ ద్వారా గతంలో నీరిచ్చాం. ఈసారి సీజన్ ను ముందుకు తీసుకువచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. వాటర్ మేనేజ్మంట్ లో ఇది కీలకమైన అంశం. మైక్రో ఇరిగేషన్ రంగంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. జలధార-జలహరతి కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలి. ప్రస్తుతం వ్యవసాయం కోసం సుమారు రూ. 17 వేల కోట్ల మేర విద్యుత్ ఖర్చులను భరిస్తున్నాం. భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అప్పుడు ప్రభుత్వంపై విద్యుత్ భారం కూడా తగ్గుతోంది. అందుకే నీటి భద్రతకు ప్రాధాన్యమిస్తున్నాం."అని ముఖ్యమంత్రి వెల్లడించారు.


సమీక్షలో ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ వివరాలు...

  • 1. కాటన్ బ్యారేజ్ గేట్స్ (ఫౌండేషన్) - జూన్ 2026
  • 2. పోలవరం ఎడమ ప్రధాన కాలువ - జూలై 2026
  • 3. గుంటూరు ఛానల్ ఆధునీకరణ (ఫౌండేషన్) - జూలై 2026
  • 4. వెలిగొండ ఫేజ్ - 1 - ఆగస్టు 2026
  • 5. తుంగభద్ర కొత్త గేట్లు - జూన్ / జూలై 2026
  • 6. హంద్రీ నీవా బ్రాంచ్ (ఫౌండేషన్) - ఆగస్టు 2026
  • 7. గాలేరు నగరి (ఫౌండేషన్) - ఆగస్టు 2026
  • 8. నేరడి బ్యారేజ్ (ఫౌండేషన్) - నవంబర్ 2026
  • 9. మద్దువలస ఫేజ్-2 - జనవరి 2027
  • 10. హీర మండలం ఎత్తిపోతల పథకం - ఏప్రిల్ 2027
  • 11. నాగావళి - చంపావతి నదుల లింక్- జూన్ 2027
  • 12. పోలవరం ప్రాజెక్ట్ - జూన్ 2027
  • 13. బుడమేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ (అండర్ టన్నెల్, డ్రైనేజ్ ఛానల్, కొల్లేరు వరకు) - జూన్ 2027
  • 14. ముక్త్యాల ఎత్తిపోతల పథకం - జూన్ 2027
  • 15. వంశధార ఫేజ్-2 స్టేజ్-2 (హిర మండలం బ్యారేజ్) - జూలై 2027
  • 16. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 - జూన్ / జూలై 2027
  • 17. హంద్రీ-నీవా ఫేజ్-2(నీవా బ్రాంచ్ కెనాల్ వరకు) - అక్టోబర్ 2026
  • 18. తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ - జూలై 2027
  • 19. నీవా బ్రాంచ్ కెనాల్ (మూలపల్లి వరకు) - జనవరి 2027
  • 20. మూలపల్లి లిఫ్ట్ - డిసెంబర్ 2027
  • 21. మడకశిర బ్రాంచ్ కెనాల్ వైడెనింగ్ - డిసెంబర్ 2027
  • 22. ఝంఝావతి రిజర్వాయర్ - డిసెంబర్ 2027
  • 23. వేదవతి ఎత్తిపోతల పథకం - జూన్ 2028
  • 24. భైరవాని తిప్ప - జూన్ 2028
  • 25. అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ - జూన్ 2028
  • 26. జీఎన్ఎస్ఎస్ కెనాల్(కడప వరకు) - జూన్ 2028
  • 27. సోమశిల-స్వర్ణముఖి లింక్ - జూన్ 2028
  • 28. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ వైడనింగ్ - డిసెంబర్ 2028
  • 29. తారక రామతీర్థ సాగర్ - డిసెంబర్ 2027
  • 30. మహేంద్ర తనయ - జూలై 2027
  • 31. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ - జూలై 2027
  • 32. గాలేరు-నగరి(కడప, కోడూరు వరకు) - డిసెంబర్ 2028
  • 33. కోడూరు-బాలాజీ సాగర్ - డిసెంబర్ 2028
  • 34. గోదావరి డెల్టా మోడ్రనైజేషన్ - జూన్ 2028
  • 35. పెన్నా-సర్వేపల్లి - డిసెంబర్ 2026
  • 36. వరికిపూడిసెల - డిసెంబర్ 2028
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+