ఏమీ లేదు..! కొడుకు పేరు ఏదో లింగం..అంటున్న ఏపి మంత్రులు..! తొందరొద్దంటున్న బాబు..!
ఆలూ లేదూ చూలూ లేదూ కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే. ఏపీ లో అదికార తెలుగుదేశం పార్టీ అదికారికంగా పొత్తులపై స్పష్టత ఇవ్వకముందే కొంతమంది నేతలు నోటకి పని చెప్తున్నారు. చంద్రబాబు వ్యూహాలను అర్థం చేసుకోకుండా కారాలుమిరియాలు నూరుతూ ఎగిరెగిరి పడుతున్నారు. పొత్తుల అంశాన్ని తొందరపడి నిర్థారించని చంద్రబాబును సీనియర్లని చెప్పుకుంటున్న కొంతమంది నేతలు తప్పుగా అర్థం చేసుకుని ప్రకటనలు గుప్పించడం మంచిది కాదంటోంది టీడిపి అదిష్టానం. ఏపిలో కాంగ్రెస్ టీడిపి పొత్తు ఉంటే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేస్తూ తమ స్థాయిని చాటుకుంటున్నారు కొంతమంది సీనియర్లు. ఎవరితోపొత్తు ఉండాలి.. ఎవరితో ఉండకూడదు., అసలు పొత్తులు ఉన్నా లేకపోయినా పార్టీని గెలిపించుకునే బాద్యత చంద్కబాబుదే అన్న విషయాన్ని సదరు నేతలు మర్చిపోయి స్టేట్ మెంట్లు ఇవ్వడం ఏపీలో హాస్యాస్పదంగా మారింది.

నేతల తొందరపాటు ప్రకటనలు..! పార్టీ బలోపేతం పై ద్రుష్టి పెట్టండంటున్న బాబు..!!
రాజకీయాల్లో విజయం అనేది అంత తొందరగా వరించదు. పదేళ్ల తరువాత చంద్రబాబు కష్టానికి ప్రతిఫలం ఏపీలో అధికారం. ఇవేమీ నేతలకు పట్టినట్టులేదు. బాబు ఎన్నికల వ్యూహం ఏమిటనేది గుర్తించకుండానే ఎవరికి వారు నోరు జారుతున్నారు. పొత్తుల గురించి సమాలోచనలు చేయకుండానే. టీడీపీ సీనియర్లు విమర్శలకు బెదిరింపులకు తెరలేపుతున్నారు. ఇప్పటికే బీజేపీ ఎత్తుకు తెలుగుదేశం పార్టీ అవినీతి మకిలను అంటిచుకోవాల్సి వచ్చింది. పైగా 2019 తెలుగుదేశం పార్టీకు జీవన్మరణ సమస్య. ఇవేమీ పట్టని నేతలు ఒకరి తరువాత ఒకరు ఇష్టానుసారం స్పందిస్తున్నారు. బీజేపీతో పొత్తు చెడ్డాక కాంగ్రెస్ వైపు బాబు చూపులంటూ ప్రచారం విపరీతంగా పెరిగింది.

బాబుకే సలహాలా..? ఛాదస్తం కాకపోతే ఏంటంటున్న పార్టీ శ్రేణులు..!
జాతీయస్థాయ రాజకీయాలను ప్రభావితం చేయగల నేతగా బాబుపైనే అందరి చూపు అంటూ మీడియా కూడా చిలువలుపలువులుగా రాస్తూ.. ఊహాగానాలను మరింత పెంచేసింది. ఫలితంగా అధినేత మదిలో ఏముందనేది తెలియకుండానే పార్టీ నేతలు మాత్రం నిర్ణయానికి వస్తున్నారు. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు ఉండరు. కేవలం రాజకీయ విబేధాలు మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. వద్దన్న బీజేపీతో కలిసేందుకు అవకాశం రావచ్చు. మరోసారి కేసీఆర్‌తో చంద్రబాబు నడవనూ వచ్చు. కాబట్టి ఇవన్నీ పార్టీలు గెలుపు కోసం వేసే ప్రణాళికలుగానే చూడాల్సి ఉంటుంది.

బాబు చతురత ముందు మంత్రుల ప్రకటనలు పనికివాస్తాయా..?
కానీ కాంగ్రెస్‌నేత రాహుల్‌తో కాస్త సఖ్యతగా ఉన్న చంద్రన్న ఇక హస్తంతో దోస్తీనంటూ మంత్రి కేఈ కృష్ణమూర్తి అలిగినంత పనిచేశాడు. హస్తం తో కలుస్తారా అంటూ అదేదో చేయరాని తప్పన్నంతగా కేఈ తాను ఆత్మహత్యచేసుకునేంత వరకూ చేరారు. ఇప్పుడు అదే బాటలో మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ హస్తంతో చెలిమి చేస్తే ఊరుకుంటానా? అయినా అన్నగారి మాట దిక్కారమున్ చేతురా అంటూ చంద్రబాబును నిలదీసేంతగా స్పందించాడు.

నేతలు తొందరపడితే ఎలా.. అన్నీ చూసుకునేది బాబే కాదా అంటున్న కార్యక్తలు..
ఇప్పటికే పురందేశ్వరీ కూడా ఇదే పంథాలో స్పందించి కాంగ్రెస్ తో పొత్తు వద్దంటూ బయట నుంచి సూచించారు. ఆమె ఏకంగా పార్టీలో చేరి పదవులు అనుభవిస్తే అన్నగారి ఆత్మక్షోబించదా అంటూ టీడీపీ శ్రేణులు బాగానే స్పందించాయి. అయినా మా పార్టీ మా వ్యక్తిగత మనేంతగా చిన్నమ్మకు చీవాట్లు పెట్టారు. ఇప్పుడు అయ్యన్న హస్తంతో పొత్తుపై స్పందించిన తీరు పార్టీలో కలకలం రేకెత్తిస్తోంది. అధినేత మాటను దిక్కరించేంతగా నేతలు చేరుతున్నారనే ప్రచారం పార్టీకు నష్టం తెస్తుందంటూ సగటు కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.












Click it and Unblock the Notifications