వ్యక్తులకే ప్రాధాన్యత, ఎవరికీ దక్కని హ్యట్రిక్, సంచలనాలే నంద్యాల చరిత్ర

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు (హ్యట్రిక్) విజయాన్ని ఎవరూ స్వంతం చేసుకోలేదు. ఈ స్థానంలో పార్టీలు ఏవైనా కానీ, ఓటర్లు మాత్రం వ్యక్తులను చూసి మాత్రం ఓటు వేస్తారని గత చరిత్ర చెబుతోంది. ఈ ఎన్నికల్లో నంద్యాల ఓటర్లు ఏ రకమైన తీర్పును ఇస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

నంద్యాల వైసీపీకి పీకే సర్వే షాక్: 4 గ్రామాలే కీలకం, జగన్ ప్రచారం వెనుక..

అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఏ రకమైన ఫలితం వస్తోందోననే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. టిడిపి, వైసీపీలు ఈ స్థానంలో విజయం సాధించేందుకు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం అనేక సంచనాలకు కారణంగా ఉందని గత చరిత్ర చెబుతోంది. ఈ స్థానంలో పోటీచేసిన అభ్యర్థులను మాత్రమే చూసి ఓటర్లు ఓటు వేసే పరిస్థితులు నెలకొన్నాయని చరిత్ర చెబుతోంది

''రోజాది చింతామణి క్యారెక్టర్, ఆల్కహల్ టెస్ట్ చేయాలి'', ''బాబు చెంచాలకు ఉలికిపాటు''

పార్టీలను పక్కనపెట్టి కూడ అభ్యర్థులను చూసీ ఓట్లు వేసిన సందర్భాలు ఈ నియోజకవర్గంలో చోటుచేసుకొన్నాయి. అయితే ఈ నెల 23వ, తేదిన ఈ స్థానానికి ఉపఎన్నికలు జరగనున్నాయి..

హ్యట్రిక్ ఎవరూ సాధించలేదు

హ్యట్రిక్ ఎవరూ సాధించలేదు


నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి వరుసగా మూడుసార్లు ఎవరూ కూడ విజయం సాధించలేదని ఎన్నికల రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ స్థానం నుండి మూడు సార్లు విజయం సాధించిన అభ్యర్థులు కూడ లేకపోలేదు.మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మూడుసార్లు ఈ స్థానం నుండి విజయం సాధించారు. 1985లో ఆయన మొదటిసారి విజయం సాధించారు. 1989లో ఆయన ఓడిపోయారు. 1994లో ఆయన విజయం సాధించారు. 1999లో కూడ ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆయన మూడుసార్లు విజయం సాధించినా , కానీ, హ్యట్రిక్ మాత్రం దక్కలేదు.

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చే నంద్యాల ఓటర్లు

వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చే నంద్యాల ఓటర్లు

నంద్యాల ఓటర్లు పార్టీల కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తారని చరిత్ర చెబుతోంది. స్వతంత్ర అభ్యర్థులను ఈ స్థానం నుండి విజయం సాధించిన రికార్డులను చూస్తే అర్థమౌతోంది. 1952 నుండి 2014 వరకు 15 దఫాలు ఈ స్థానానికి ఎన్నికలు జరిగితే నలుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1952లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గోపవరం రాంరెడ్డిని ఇండిపెండెంట్ అభ్యర్థి మల్లు సుబ్బారెడ్డి ఓడించాడు. 1957లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గోపవరం రాంరెడ్డి పోటీచేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు సుబ్బారెడ్డి పోటీచేశారు. అయితే మల్లు సుబ్బారెడ్డి ఓడిపోయాడు. 1962లో మల్లు సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 1972లో ఇండిపెండెట్ అభ్యర్థి బొజ్జా వెంకట్‌రెడ్డి గెలుపొందారు. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

సంచనాలకు కేంద్రం నంద్యాల ఓటర్లు

సంచనాలకు కేంద్రం నంద్యాల ఓటర్లు

నంద్యాల ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ విలక్షణమైన తీర్పును ఇస్తారని చరిత్ర చెబుతోంది. వ్యక్తులకే ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారని తేలింది. అయితే పార్టీలను పక్కన పెట్టి స్వతంత్ర అభ్యర్థులను కూడ గెలిపించిన చరిత్ర కూడ ఈ నియోజకవర్గ ఓటర్లకు దక్కుతోంది.అయితే ఇండిపెండెంట్ గా పోటీచేసిన అభ్యర్థులు ఆ తర్వాత పార్టీ అభ్యర్థులుగా పోటీచేసినా ఓటమిపాలైన సందర్భాలు కూడ లేకపోలేదు. ఈ నెల 23న, జరిగే ఎన్నికల్లో ఓటర్లు ఏ రకమైన తీర్పు ఇస్తారో చూడాలి

ఇద్దరే మంత్రులు

ఇద్దరే మంత్రులు

నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఎన్ఎండి ఫరూక్‌కు మంత్రి పదవి దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో శిల్పా మోహన్‌రెడ్డికి మంత్రి పదవి లభించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
No one got Hat Trick win from Nandyal assembly seat since 1952.Former minister , Tdp leader NMD Farooq was won thrice from Nandyal.Independent candidates was won four times from this assembly segment
Please Wait while comments are loading...