వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, జగన్, హరీష్, నన్ను ఎవరూ ఓడించలేరు: టిడిపికి కొడాలి నాని కౌంటర్

గుడివాడలో తనను ఓడించడం ఎవరి తరం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబు నాయుడు ని ఓడించడం ఎవరి వల్లా కాదు ! కొడాలి నాని సవాల్ | Oneindia Telugu

గుడివాడ: గుడివాడలో తనను ఓడించడం ఎవరి తరం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.

చదవండి: విమర్శకులకు చెంపపెట్టు, ఇదీ పవన్ కళ్యాణ్ అంటే: సుదీర్ఘ సమస్యపై మరో విక్టరీ

ఇదీ నా సత్తా

ఇదీ నా సత్తా

తనకు గుడివాడలో మంచి బలం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గుడివాడలో తనను దెబ్బకొట్టే వారు లేరని చెప్పారు. కొందరు నేతలను కొన్ని చోట్ల ఎవరూ ఓడించలేరని, అలాగే గుడివాడలో తనను ఎవరూ ఓడించలేరని చెప్పారు.

వీరిపై ఎవరూ గెలవలేరు

వీరిపై ఎవరూ గెలవలేరు

కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే పులివెందులలో తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరి వల్ల కాదన్నారు. వారిపై ఆయా నియోజకవర్గాల్లో ఎవరూ గెలవలేరని చెప్పారు.

మా నలుగురినీ ఓడించలేరు

మా నలుగురినీ ఓడించలేరు

తెలంగాణ మంత్రి హరీష్ రావు పేరును కూడా కొడాలి నాని తీశారు. సిద్దిపేటలో హరీష్ రావును ఓడించడం కూడా ఎవరి వల్ల కాదన్నారు. చంద్రబాబు, జగన్, హరీష్ రావు, తనను తమ తమ నియోజకవరగాల్లో ఎవరూ ఓడించలేరని స్పష్టం చేశారు.

ఈ నాలుగు స్థానాల్లో మేమే గెలుస్తాం

ఈ నాలుగు స్థానాల్లో మేమే గెలుస్తాం

కుప్పం, పులివెందుల, గుడివాడ, సిద్దిపేట.. ఈ నాలుగు స్థానాల్లో ఎప్పటీకి తామే గెలుస్తామని కొడాలి నాని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.

అందుకే నాని కౌంటర్

అందుకే నాని కౌంటర్

ఈ నేపథ్యంలో కొడాలి నానిపై టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు. కొడాలి నాని తన పదవికి రాజీనామా చేస్తే, తమ పార్టీ కార్యకర్తను నిలబెట్టినా కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తాడని టిడిపి నేతలు సవాల్ చేసారు. ఈ నేపథ్యంలో నాని స్పందించారు.

English summary
YSR Congress Party MLA Kodali Nani on Thursday said that no one will win on AP CM Chandrababu Naidu in Kuppam, YS Jagan in Pulivendula and Harish Rao in Siddipet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X