Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు, ఏపీ ప్రజలకు విద్యుత్ శుభవార్త: చంద్రబాబు

తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండ‌గ సంద‌ర్భంగా తెలుగులోగిళ్లు పండగ వాతావరణంతో కళకళలాడాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు.

అమరావతి: తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండ‌గ సంద‌ర్భంగా తెలుగులోగిళ్లు పండగ వాతావరణంతో కళకళలాడాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ ప్రజలకు పండుగ శుభవార్త తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పైసా కూడా పెంచ‌బోమ‌ని తెలిపారు. విద్యుత్ కోతలకు చరమగీతం పాడి అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

No power hikes in andhra pradesh: Chandrababu Naidu

విద్యుత్ మిగులుతో మూతపడ్డ పరిశ్రమలు తెరుచుకున్నాయని చెప్పారు. ఉత్పత్తులు పెరగడం ద్వారా రోడ్డున పడ్డ కుటుంబాలకు ఉపాధి దొరికిందన్నారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయాన్ని ప్రజలకు అంకితమిస్తున్నట్లు చెప్పారు.

స్మార్ట్ గ్రిడ్‌తో ప్రపంచానికి ఏపీ మార్గదర్శకం కావాలన్నారు. ఫైబర్ నెట్‌తో ప్రతి ఇల్లు ఓ విజ్ఞాన కేంద్రమవుతుందన్నారు. మహిళలను గౌరవించడంతోనే సరిపెట్టకుండా వారికి సాధికారత కల్పించిన ఘనత తమదేనని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+