కెసిఆర్, బాబులకు షాక్: రుణాల రీషెడ్యూల్‌పై నో హామీ

No promise on loan reschedule: RBI
హైదరాబాద్: వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణాల రీ షెడ్యూల్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఎలాంటి హామీ ఇవ్వలేదని డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి)లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గాంధీ, తరువాత మీడియాతో మాట్లాడారు.

రీ షెడ్యూల్‌పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభించలేదన్నారు. రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించిందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా, ఇందుకు విరుద్ధంగా ఆయన మాట్లాడారు. రైతుల రుణాలను మాఫీ చేయాలంటే కొన్ని మార్గదర్శకాలు ఉంటాయన్నారు.

ఒకవైపు తెలంగాణ ప్రభుత్వంతో, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. రెండు ప్రభుత్వాలూ తమ వైఖరిని వివరిస్తూ నివేదికలు పంపాల్సి ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రుణాల రీ షెడ్యూల్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో బ్యాంకర్ల వద్ద ఖచ్చితమైన నియమావళి ఉంటుందన్నారు. రిజర్వ్ బ్యాంక్ నియమావళి ఒకటి ఉందన్నారు.

రిజర్వ్ బ్యాంక్ నియమాళికి అనుగుణంగా రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటి (ఎస్‌ఎల్‌బిసి) ఆమోదం తర్వాత రీ షెడ్యూల్ అమల్లోకి వస్తుందన్నారు. ఈ పరిస్థితిలో వాస్తవ వివరాలతో ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ వద్దకు రావచ్చన్నారు. వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌పై రెండు రోజుల్లో లేఖ పంపించేందుకు ఆర్బీఐ గవర్నర్ అంగీకరించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+