వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హక్కులేదు: స్పీకర్‌కు టి ఎమ్మెల్యేలు, జగన్‌పార్టీపై వేటే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభలో సవరణలు ప్రతిపాదించే వీల్లేదని, ఎలాంటి సవరణలు చేసినా పార్లమెంటులో చేయాలని తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు సభాపతి నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. బిల్లు పైన అభ్యంతరాలను శుక్రవారం మధ్యాహ్నంలోగా చెప్పాలని సభాపతి సభ్యులకు సూచించిన విషయం తెలిసిందే.

దీనిపై తెలంగాణ మంత్రులు స్పందించారు. బిల్లు పైన ఎమ్మెల్యేలకు సవరణలు ప్రతిపాదించే హక్కు లేదని వారు అంటున్నారు. పార్లమెంటు తప్ప అసెంబ్లీ సవరణ చేయదన్నారు. అదే విధంగా బిల్లు పైన ఓటింగుకు అనుమతించవద్దని చెబుతున్నారు. అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు కలిసి సభాపతికి లేఖ రాయనున్నారు. స్పీకర్‌కు రాయాల్సిన లేఖపై చర్చించేందుకు అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత ప్రతినిధులు డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో భేటీ అయ్యారు.

Telangana

సస్పెండ్ చేసి సభ

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సభలో చర్చ జరగాలంటే అడ్డుకునే వారిని సస్పెండ్ చేసి చర్చించాలని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు కూడా చర్చకు డిమాండ్ చేస్తున్నారు.

సభను అడ్డుకునే వారిని సస్పెండ్ చేయాలని, ఆ తర్వాత చర్చ జరపాలని కాంగ్రెసు నేతలు సభాపతిని కలిసి చెప్పారు. తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీమాంధ్ర టిడిపి నేతలు, సాయంత్రం జరిగే సమావేశంలో నిర్ణయించుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలిపింది.

English summary
Telangana region MLAs ready to write a letter to Speaker Nadendla Manohar on Telangana Draft Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X