ఏపీలో మద్యం కొరత - నిలిచిన సరఫరా, ఏం జరుగుతోంది..!!

రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడింది. వైన్ షాపుల్లో మద్యం నిల్వలు నిండుకున్నాయి. ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ చేస్తున్న వేళ మందు అందుబాటులో లేకుండా పోయింది. డిపోల నుంచి షాపులకు మద్యం సరఫరా నిలిచింది. దీంతో మందుబాబులకు ఆందోళన మొదలైంది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల్లో మద్యం స్టాకులు నిండుకున్నాయి. ప్రభుత్వం ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి తీసుకురానుంది. అన్ని ప్రముఖ బ్రాండ్లను వినియోగంలోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుతం అసలు మధ్యమే దొరకటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఖరీదైన బ్రాండ్లు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో మందుబాబుల జేబులకు చిల్లు పడుతుంది. రెండు రోజులుగా విక్రయాలు పూర్తిగా పడిపోయాయని మద్యం దుకాణం నిర్వహకులు చెప్తున్నారు.

No stock in wine shops amid new liquor policy to introduce in the state

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మద్యం పాలసీ ఖరారు చేసింది. ప్రైవేట్ షాపులను తీసుకురావాలని నిర్ణయించింది. వచ్చే నెల తొలి వారంలో ఈ పాలసీ అమల్లోకి రానుంది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న స్టాక్ ను అమ్మాలని అధికారులు ఆదేశించారు. దీంతో డిపోల నుంచి సరఫరా నిలిచింది. స్టాకు లేదని సిబ్బంది చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పరిమిత సంఖ్యలోనే బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొంతమంది అధిక ధరలకు విక్రయాలు కొనసాగిస్తున్నారు.

దుకాణాల్లో దొరకపోవడంతో వినియోగదారులు బార్లకు వెళ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బార్ల యాజమాన్యాలు యదేచ్చగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీ పేరుతో ముందుగానే షాపులు ఖాళీ చేయడం పైన విమర్శలు మొదలయ్యాయి. కొత్త పాలసీ వచ్చేవరకు ప్రస్తుతం మద్యం కొనసాగించాలని డిమాండ్ వినిపిస్తుంది.

అయితే అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆదాయం కూడా తగ్గిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో సగటున ప్రతినెల రూ 2,300 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కానీ ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా ఈ ఆదాయం పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+