హీరో మహేష్ బాబుపై కేసీఆర్‌కు అలాంటి ప్లాన్ లేదా?
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, మరో హీరో నితిన్‌లను హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో వాస్తవమెంతో తెలియడం లేదు. అయితే, మహేష్ బాబును హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసే విషయమై పలువురు స్పందించారు!
ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. దీని గురించి తాను వినలేదని, అయితే మహేశ్ బాబు మంచి వ్యక్తి అని ఓ సీఎంవోకు చెందిన ఓ అధికారి చెప్పారని తెలుస్తోంది. మరో తెరాస నేత స్పందిస్తూ... ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని చెప్పారని సమాచారం.

కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబును నియమించే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా ప్రచారం సాగింది.
హీరో నితిన్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. వీరితో పాటు మరొకరిని కలిపి హైదరాబాదుకు బ్రాండ్ అంబాసిడర్ చేయాలని యోచిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. పేర్లను రెండు రోజుల్లో ఖరారు చేస్తారని కూడా ప్రచారం సాగింది.












Click it and Unblock the Notifications