ఏపీలో ఆదివారం పెట్రోల్ బంకుల బంద్ ? తేల్చేసిన ట్రేడర్స్ యూనియన్..!

అమెరికా-ఇరాన్ యుద్ద ప్రభావంతో భారత్ లో చమురు కొరత తప్పదని, ఇప్పటి నుంచే పొదుపు చర్చలు ప్రారంభించాలని తాజాగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిదులు తమ కాన్వాయ్ లో వాహనల సంఖ్యను సగానికి సగం తగ్గించుకుంటున్నారు. అదే సమయంలో చమురు పొదుపు పేరుతో ఇకపై ప్రతీ ఆదివారం (sunday) పెట్రోల్ బంకుల్ని (petrol bunk) మూసేస్తారంటూ ఓ ప్రచారం జరుగుతోంది.

ప్రధాని మోడీ పిలుపు దృష్ట్యా చమురు పొదుపు చేసేందుకు రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్ని ఆదివారం మూసేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ట్రేడర్స్ యూనియన్ స్పందించింది. ఏపీలో సండే పెట్రోల్‌ బంక్‌ల మూసివేత అనేది ఫేక్‌ అని తేల్చేసింది. ఆదివారం పెట్రోల్ బంకుల బంద్‌ అనేది అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రతి ఆదివారం ఇకపైనా నిరంతరాయంగా పెట్రోల్ బంకులు తెరిచే ఉంటాయని వెల్లడించింది.

No Sunday shutdown AP Traders Union busts petrol bunk closure rumours amid fuel crisis

సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారాన్ని నమొద్దని వాహనదారుల్ని ట్రేడర్స్ యూనియన్ కోరింది. తప్పుడు ప్రచారాలు కేవలం కల్పితాలే అని తెలిపింది. ఏపీలో ప్రస్తుతం ఇంధన ఇబ్బందులు, కొరత అనేది లేదని యూనియన్ తెలిపింది. కాబట్టి
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రేడర్స్‌ యూనియన్‌ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో ఆదివారం పెట్రోల్ బంకుల కొరత అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పష్టత వచ్చినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+