రఘురామకు గాయాలు లేవు, వైద్యుల నివేదిక.. ఆస్పత్రికి ఎంపీ, మరో పిటిషన్
తవైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు గాయాలు కాలేదని మెడికల్ బోర్డు స్పష్టంచేసింది. వైద్య బృందం ఇచ్చిన రిపోర్ట్‌ను డివిజన్ బెంచ్ హైకోర్టులో చదివి వినిపించింది. దీంతో తనకు గాయాలు అయ్యాయని చెప్పి.. రఘురామ తప్పుదోవ పట్టించినట్టు అయ్యింది. రఘురామ రిమాండ్‌పై ఏఏజీ, రఘురామ అడ్వకేట్ మధ్య వాదనలు జరిగాయి. రమేశ్ ఆస్పత్రికి వెళ్లేందుకు రఘురామ తరఫు న్యాయవాదులు సుముఖత వ్యక్తం చేశారు. కానీ ఆస్పత్రిపై ఏఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మరో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం కోరింది.
Recommended Video

10 మంది చనిపోయారు..
రమేశ్ ఆస్పత్రిలో చికిత్స చేసే అంశంపై కింది కోర్టు ఆదేశాలను పాటించాలని హైకోర్టు స్పష్టంచేసింది. రమేశ్ ఆస్పత్రికి తీసుకెళితే టీడీపీ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టే ఏఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేశ్ ఆస్పత్రిపై కేసులు ఉన్నాయని వాదనలు వినిపించారు. ఇప్పటికే 10 మంది చనిపోయారని పేర్కొన్నారు. అభ్యంతరాలతో మరో పిటిషన్ వేయాలని హైకోర్టు సూచించింది. కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ వేసే అవకాశం ఉంది.

జైలు టు ఆస్పత్రి
ఇదిలా ఉంటే అంతకుముందు ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.గుంటూరు జిల్లాలో రఘురామకృష్ణరాజుకు ఖైదీ నెంబర్ కేటాయించారు. రఘురామకు ఖైదీ నెం.3468 ఇచ్చారు జైలు అధికారులు. ఇంతలో హైకోర్టు విచారణ జరగడం.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ తర్వాత కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలీ మరీ.

హత్య చేస్తారని అనుమానం..
జగన్ సర్కార్‌పై ఎంపీ రఘురామ కృష్ణ రాజు భార్య రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తన భర్తను బాగా కొట్టారని ఆరోపించారు. కోర్టు నిబంధనలు పట్టించుకోరా అని ఆమె ప్రశ్నించారు. రమేశ్ ఆస్పత్రికి తరలించాలని కోరితే.. పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇవాళ రాత్రి తన భర్తను చంపాలని చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. అసలేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని, హత్యలు చేసేవారు రోడ్లపై తిరుగుతున్నారని.. ప్రజా సమస్యలపై ప్రశ్నించేవాళ్లని జైల్లో పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications