సీఎం జగన్ పాలన పై నోబెల్ గ్రహీత ప్రశంసలు - అద్భుతమైన మార్పు..!!
ఏపీలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపైన ప్రశంసలు అందుతున్నాయి. ఏపీలో అమలు చేస్తున్న విధానం అద్బుతంగా ఉందని నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మైకెల్ రాబర్ట్ క్రెమేర్ ప్రశంసించారు. చికాగో యూనివర్సిటీలోని డెవలప్ మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమిలీ క్యుపిటీ టీంతో కలిసి ఏపీకి వచ్చారు. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన ఆధ్వర్యంలో పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్నింగ్ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించారు.
డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ డైరెక్టర్ కూడా అయిన క్రేమెర్ మన రాష్ట్రంలోని వివిధ పాఠశాలలను సందర్శించేందుకు వచ్చారు .పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను చూసి ముచ్చటపడ్డారు. విద్యార్థుల మనోవికాసానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దుతాయని అయన కొనియాడారు. ప్రభుత్వ స్కూళ్లలో తీసుకొచ్చిన మార్పులు, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి నిజంగా కళ్ళముందు కనిపిస్తున్న ఓ అద్భుతమైన మార్పు అని అయన ప్రశంసించారు.

ముఖ్యమంత్రి జగన్ విద్యా సంస్కరణలపైన తొలి నుంచి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్దికంగా తోడ్పాటు అందిస్తున్నారు. బూట్ల దగ్గర్నుంచి తినే తిండి వరకు.. మోసే బ్యాగ్ నుంచి టాయిలెట్ల వరకూ అన్నీ దగ్గరుండి, ప్రత్యేక శ్రద్ధతో వాటిని ఎంపిక చేసి పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక ఇలా ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నందనవనాల మాదిరి తీర్చిదిద్దిన జగన్ మోహన్ రెడ్డి పాలనకు వివిధ రాష్ట్రాలు ముచ్చటపడ్డాయి. మేమూ మీలాగే చేస్తాం అంటూ మన రాష్ట్రానికి వచ్చి పాఠశాలలను చూసి వెళ్లాయి.

ఇక ఇప్పుడు ఏకంగా నోబెల్ అవార్డ్ గ్రహీత, చికాగో యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మైకేల్ రాబర్ట్ క్రేమెర్ సైతం ఏపీలోని విద్యాశాఖ పని తీరు పైన ప్రశంసలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలతో పాటుగా నాడు నేడులో భాగంగా పాఠశాలల రెన్నోవేషన్.. అమ్మఒడి, విదేశీ విద్యానిధి, విద్యా కానుకతో సహా చదువుకొనే విద్యార్ధులకు ప్రభుత్వం ఆర్థికంగా అందిస్తున్న తోడ్పాటుకు సంబంధించి వివరాలు సేకరించారు. మానవ వనరుల పైన పెడుతున్న ఈ పెట్టుబడి భవిష్యత్ కు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications