నామినేటెడ్ పదవుల మూడో లిస్టు విడుదల - జాబితా ఇలా..!!

ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. చాలా రోజులుగా ఈ జాబితా కోసం కూటమి లోని మూడు పార్టీల నేతలు వేచి చూస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు తరువాత ఈ రోజు మూడో జాబితా ను ప్రకటించారు. ఈ జాబితాలో మార్కెట్ కమిటీలతో పాటుగా రాష్ట్ర స్థాయి కార్పోరేషన్లు.. ఆలయ పాలక వర్గాలకు నియామకాలు జరుగుతాయని అంచనా వేసారు. కాగా, ఈ జాబితాలో 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో.. 705 పదవులు భర్తీ చేసినట్లు కూటమి నేతలు వెల్లడించారు.

మూడో జాబితాలో
కూటమి ప్రభుత్వం మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించారు. 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది ఎంపిక చేసినట్లు నేతలు వెల్లడించారు. ప్రకటించిన 47 ఏఏంసి ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటిస్తామని స్పష్టం చేసారు. తొలుత ఈ మూడో జాబితాలో దాదాపు 60 వ్యవసాయ మార్కెట్ కమిటీ లతో పాటుగా మరో 60 కీలక కార్పోరేషన్లు .. 21 ఆలయ పాలకవర్గాలకు నియామకాలు పూర్తి చేయాలని భావించారు. కానీ, 47 మార్కెట్ కమిటీలకే పరిమితం చేసారు.

nominated-posts-third-list-finalised-47-market-committee-chairman-names-announces

ఛైర్మన్ పదవుల కోసం
నామినేటెడ్ పదవుల కోసం కేవలం టీడీపీ నుంచి 60 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన పవన్, పురందేశ్వరి తో చంద్రబాబు చర్చించారు. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబరులో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు పదవులు ఖరారు చేసారు. ఇక.. ఇప్పుడు మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీ కోసం నాలుగు నెలలుగా కసరత్తు చేసారు. మూడు పార్టీలకు ప్రాధాన్యత - సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని జాబితా ప్రకటించారు.

Take a Poll

పెరుగుతున్న ఉత్కంఠ

టీడీపీతో పాటుగా కూటమిలోని మిగిలిన రెండు పార్టీల నుంచి పలువురు నేతలు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. దీంతో, కసరత్తు విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వారు రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవుల పై హామీ పొంది దక్కని వారు సైతం రాష్ట్ర స్థాయి ఛైర్మన్ల రేసులో ఉన్నారు. అందులో జనసేన, బీజేపీ నుంచి పోటీ పెరుగుతోంది. దీంతో, ముందుగా మార్కెట్ కమిటీలను ప్రకటించి.. రాష్ట్ర స్థాయి పదవుల పైన మలి విడతలో ఖరారు చేయాలని నిర్ణయించారు. దీంతో.. మిగిలిన పోస్టు లపై మరి కొద్ది రోజుల్లోనే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా మార్కెట్ కమిటీల కే పరిమితం కావటంతో.. పోస్టులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ పెరిగిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+