సినీ నటి జీవితపై మరో నాన్ బెయిల్‌బుల్ వారెంట్
హైదరాబాద్: సినీనటి జీవితపై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇది కూడా చెక్ బౌన్సు కేసే కావడం గమనార్హం. సినీ నటి జీవితకు సిటీ సివిల్ కోర్టు మంగళవారం నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.

జీవిత ఇచ్చిన రూ.25 లక్షల చెక్ బౌన్స్ అయిందంటూ పరంధామయ్య రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దాంతో సివిల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇవాళ నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌తో జీవిత ఇంటికి వెళ్లారు. అయితే ఆమె అందుబాటులో లేకపోవటంతో పోలీసులు వెనక్కు వచ్చారని తెలుస్తోంది.
కాగా, ఓ నిర్మాతకు గతంలో ఇచ్చిన చెక్కు బౌన్సు కావడంతో జీవితకు రెండేళ్ల జైలుశిక్ష, రూ.25 లక్షల జరిమానాను ఎర్రమంజిల్ కోర్టు విధించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications