హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Weather alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వడగళ్ల వానలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరోసారి పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కుమురంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వివిధ పంటలు ధ్వంసమయ్యాయి. సీఎం కేసీఆర్ కూడా పలు జిల్లాల్లోపర్యటించి రైతులను కలిసి అండగా ఉంటామని చెప్పారు. ఆర్థిక సాయం ప్రకటించారు.

normal to heavy rains in andhra pradesh and telangana district

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా రాయలసీమ నుంచి దక్షిణ జార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

కృష్ణా, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, ఏలూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. అకాల వర్షాలతో ఏపీలోనూ పలు పంటలకు నష్టం వాటిల్లింది. సీఎం జగన్ పంట నష్టంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

English summary
normal to heavy rains in andhra pradesh and telangana district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X