బాబుకే చిక్కు?: రేవంత్ అప్రూవర్‌గా మారితే సాఫీ, టీడీపీ కొత్త మెలిక!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు వ్యవహారం నుండి బయటపడతారా? లేదా అనే చర్చ సాగుతోంది. న్యాయనిపుణులు, అధికారులు తదితరులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో ఆధారాలు కనిపిస్తున్నాయని, రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ ఇంటికి వెళ్లారని, అక్కడ డబ్బుల సంచి ఉందని, తన పార్టీకి చెందని వారి ఇంటికి రేవంత్ వెళ్లారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అలా వెళ్లడాన్ని ప్రశ్నించవలసి ఉంటుందన్నారు.
అయితే, రేవంత్ రెడ్డి వ్యవహారంలో అంతిమంగా పార్టీ (టీడీపీ) లబ్ధి పొందుతుందని కాబట్టి ఆ పార్టీ అధినేత కూడా చిక్కుల్లో పడవచ్చునని చెబుతున్నారు. ఎన్నికల్లో బలం లేకున్నా అభ్యర్థిని నిలబెట్టడం, లంచం ఇవ్వజూపడం నేపథ్యంలో ఆ ఆధారాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారితే..

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అప్రూవర్‌గా మారితే అతని రాజకీయ భవిష్యత్తు సాధారణమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, చంద్రబాబును చిక్కుల్లో పడేయడం అంత సులభం కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. స్టీపెన్ ఇంటికి రేవంత్ డబ్బులు తీసుకు వెళ్లినట్లుగా ఎక్కడా లేదని అంటున్నారు. అయితే, డబ్బులు ఇచ్చినట్లుగా చూపించినట్లుగా ఉన్న వ్యవహారం వీడియోలో ఉంది.
అలాగే, సీఎం ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని చెబుతున్నారు. అలాగే, అసలు ఆడియోలో ఉన్న గొంతు చంద్రబాబుదా కాదా తెలియాల్సి ఉంది. అది చంద్రబాబుది కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు, గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ - బీజేపీ కూటమికి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు 17 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే చాలని, అలాంటప్పుడు తాము లంచం ఎందుకు ఇవ్వజూపుతామని టీడీపీ కోర్టులో చెప్పే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అలాగే, 63 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తెరాసకు ఉన్నారని, ఆ పార్టీ 5గుర్ని ఎలా నిలబెడుతుందని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications