రైలు ప్రయాణికులకు గమనిక.. విజయవాడ డివిజన్‌లో ప‌లు రైళ్లు రద్దు...

ఏపీలోని రైలు ప్రయాణికులకు గమనిక.. విజ‌య‌వాడ డివిజ‌న్‌లో ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. వీటితో పాటు కొన్ని రైళ్ల దారుల‌ను కూడా మ‌ళ్లించారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో నిర్వహ­ణ పనుల నిమిత్తం పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయ‌డం జ‌రిగింది. ఆ రైళ్ల వివ‌రాల‌ను ఓసారి చూద్దాం.

మచిలీపట్నం టు విజయవాడ (07896/07769) ట్రైన్‌, నర్సాపూర్ టు విజయవాడ (07863/07866), మచిలీపట్నం నుంచి విజయవాడ (07770), విజయవాడ నుంచి భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం టు విజయ­వాడ (07870), విజయవాడ టు నర్సాపూర్‌ (078661) రైళ్లను రెండు మార్గాల్లో రామవరప్పాడు-విజయవాడ మధ్య ఈ నెల 15 నుంచి 28 వరకు తాత్క‌లికంగా ర‌ద్దు చేయ‌డం జ‌రిగింది. ప్ర‌యాణికులు గ‌మ‌నించ‌గ‌ల‌రు.

Note to train passengers.. many trains canceled in Vijayawada division...

విజయవాడ-విశాఖపట్నం నుంచి బ‌య‌లుదేరే ఈ నెంబ‌ర్‌గ‌ల 22702/222701 రైలును ఈ నెల 19, 20, 22, 23, 24, 26, 27 తేదీల్లో రద్దు చేశారు. గుంటూరు-విశాఖపట్నం (17239) రైలు ఈ నెల 19 నుంచి 28 వరకు ర‌ద్దు చేశారు. ఇక‌, విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లే ఈ నెంబ‌ర్‌గ‌ల 17240 రైలు ఈ నెల 20 నుంచి 29 వరకు రద్దయ్యింది. ప్ర‌యాణికులు గ‌మ‌నించ‌గ‌ల‌రు. వీటితోపాటు బిట్రగుంట-విజయవాడ (07977/07978) రైలు ఈ నెల 19 నుంచి 28 వరకు ర‌ద్ధ‌య్యింది. బిట్రగుంట నుంచి చెన్నై సెంట్రల్ బ‌య‌లుదేరే (17237/17238) ట్రైన్‌ను ఈ నెల 22 నుంచి 26 వరకు రద్దు చేశారు.

దారి మ‌ళ్లించిన రైళ్ల వివ‌రాలు ఇవే..

జ‌న‌వ‌రి 15,22 తేదీలో ఎర్నాకుళం టు పాట్నా (22643) వెళ్లే రైలును దారి మ‌ళ్లించారు. భావ్‌నగర్ టు కాకినాడ టౌన్‌ (12756) ట్రైన్‌ను ఈ నెల 20, 29 తేదీల్లో దారి మళ్లించ‌డం జ‌రిగింది. వీటితో పాటు జ‌న‌వ‌రి 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు టు గౌహతి వెళ్లే ట్రైన్ (12509) దారి మ‌ళ్లించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌-భువనేశ్వర్‌ (11019) రైళ్లను ఈ నెల 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో దారి మళ్లించారు. వీటితోపాటు ధనబాద్ టు అలెప్పి (13351) ట్రైన్‌ను ఈ నెల 15 నుంచి 28 వరకు దారి మ‌ళ్లించారు.

జ‌న‌వ‌రి 18, 25 తేదీల్లో టాటా టు యశ్వంత్‌పూర్‌ (18111) వెళ్లే ట్రైన్‌తోపాటు ఈ ­నెల 17, 24 తేదీల్లో జసిదిహ్‌-తాంబరం (12­376) రైళ్లను కూడా దారి మ‌ళ్లించ‌డం జ‌రిగింది. హథియా టు ఎర్నాకుళం (22837) ట్రైన్‌ను ఈ నెల 15, 22 తేదీల్లో దారి మ‌ళ్లించారు. ఈ నెల 15, 24 తేదీల్లో హథియా-బెంగళూరు (18637) ట్రైన్‌తో పాటు, ఈ నెల 20, 27 తేదీలలో హథియా-బెంగళూరు (18637), జ‌న‌వ‌రి 16, 21, 23, 28 తేదీలలో హథియా-బెంగళూరు (12835), ఈ నెల 19, 26 తేదీల్లో టాటా-బెంగళూరు (12889) వెళ్లే రైళ్లను కూడా దారి మళ్లించారు. ఈ రైళ్లన్నీ విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా మళ్లించినట్లు రైల్వే అధికారులు వివ‌రించారు. కాబ‌ట్టి ప్రయాణికులు రద్దైన రైళ్ల విషయాన్న, దారి మ‌ళ్లించిన రైళ్ల విష‌యాన్నిగమనించి, అందుకు తగిన విధంగా ప్ర‌యాణాన్ని ప్ర‌ణాళిక చేసుకోవాల‌ని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+