కేసులు ఏమీ చేయలేవు, కెసిఆర్‌వి గల్లీ రాజకీయాలు: నారా లోకేష్
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో తాజాగా సంభవించిన పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ స్పందించారు. ఈ కేసులు తమను ఏమీ చేయలేవని ఆయన అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావువి గల్లీ రాజకీయాలని, చంద్రబాబువి దేశ రాజకీయాలని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలు కంగారు పడవద్దని ఆయన సూచించారు.

గవర్నర్ మౌనపాత్రపై సందేహాలు ఉన్నాయని, పదవిలో కొనసాగే నైతికహక్కు ఆయనకు లేదని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడుసూర్యారావు విమర్శించారు. టీఆర్‌ఎస్, వైసీపీ పార్టీలు కుమ్మక్కై తెలుగుజాతికి అన్యాయం చేశాయన్నారు.
సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు పెడితే.. తామూ కేసులు పెడతామని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తూర్పు గోదావరి జిల్లాలో హెచ్చరించారు. తమ పార్టీతో పెట్టుకున్న వారు సర్వనాశనమయ్యారని, ఇందిరాగాంధీ, రాజశేఖర్‌రెడ్డిలకు పట్టి గతే కేసీఆర్‌కు పడుతుందని తెలుగుదేశం పార్టీ పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.












Click it and Unblock the Notifications