కేతిరెడ్డి పై గురి - తాజా నిర్ణయంతో ఉక్కిరి బిక్కిరి..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వైసీపీ ముఖ్య నేతల లక్ష్యంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డికి చెందిన నిర్మాణాల పైన అధికారులు ఫోకస్ చేసారు. గతంలో లోకేష్ తన పాదయాత్ర సమయంలో కేతిరెడ్డి ఫాం హౌస్ ల గురించి సవాల్ విసిరారు. ప్రభుత్వ భూమితో పాటుగా చెరువును కబ్జా చేసారనే ఆరోపణలు వేళ తాజాగా అధికారులు నోటీసులు జారీ చేసారు.
కేతిరెడ్డి నిర్మాణాలు
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పైన కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి నియోజకవర్గంలో నిత్యం పర్యటించే వారు. లోకేష్ తన పాదయాత్ర సమయంలో ధర్మవరంలో కేతిరెడ్డి నిర్మాణాల పైన సెల్ఫీ ఛాలెంజ్ చేసారు. అధికారంలోకి రాగానే గుడ్ మార్నింగ్ స్టార్ అక్రమాలపై చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు. ధర్మవరం చెరువుతో పాటుగా ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణాలు చేసారనేది ప్రధాన అభియోగం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటంతో కేతిరెడ్డి నిర్మాణాల విషయంలో తాజాగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నోటీసులు జారీ
వారం రోజుల్లో చెరువును ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను ఖాళీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరదలు గాలి వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. ప్రభుత్వ భూమితో కలిసి చెరువును సైతం కబ్జా చేసినట్లు.... దాదాపు 30 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోనే సర్వేనెంబర్ 904, 905, 908,908 సర్వే నంబర్లు పరిధిలోనే రైతుల నుంచి 25 ఎకరాలు గాలి వసుమతి కొనుగోలు చేసినట్లు అప్పటి రెవెన్యూ అధికారులు రికార్డుల్లోకి ఎక్కించారు. ఈ సర్వే నంబర్లకు ఆనుకుని ఉన్న 908,909,910,616-1 సర్వే నంబర్లు పరిధిలోనే దాదాపు 20 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు.
ఆక్రమణలు
అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం కేతిరెడ్డి కొనుగోలు చేసింది 20 ఎకరాలు కాగా, ఆక్రమించుకున్నది 20 ఎకరాలు కలిపి 45 ఎకరాలలో విలాసవంతమైన ఫామ్ హౌస్, రేస్ ట్రాక్ గుర్రాల కోసం షెడ్లు, చెరువులో బోటింగ్ కోసం సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. తన తమ్ముడు కృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించారు. ధర్మవరం మండల పరిధిలోని మల్లా కాల్వ గ్రామంలో సైతం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. మల్లా కాలువ గ్రామంలో ఆక్రమించిన భూములపై నోటీసులు ఇచ్చిన అధికారులు పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications