ఏపీలో మోగిన ఎన్నికల నగారా! ఆ పదవుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కడప జడ్పీ ఛైర్ పర్సన్, కర్నూలు జడ్పీ కో-అప్టుడ్ మెంబ్, 28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్‌లో 12 మంది కో-ఆప్ట్‌డ్‌ సభ్యులు, 214 మంది ఉపసర్పంచుల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది. మార్చి 27న ఉపఎన్నికలు జరగనున్నాయి.
పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది. మార్చి 27న ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర పోటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి.. ప్రతిపక్ష వైసీపీ ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.

ఇది ఇలావుంటే, మార్చి 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు ఉండనుంది. గత కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్యలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, పీ4 అమలు, సంక్షేమ పథకాలు అమలు ప్రధాన అజెండాగా కలెక్టర్ల సమావేశం జరగనున్నట్లు సమాచారం.

Notification for filling up posts in local bodies in Andhra Pradesh

మరోవైపు, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు మంగళవారం ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై మూడు రోజుల్లోగా జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరపాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ ార్టీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ మేరకు స్పందించింది. ఏపీ డీజీపీ నుంచి ఈసీ వివరణ కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+