స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలు: 2 రాష్ట్రాల్లో ఒకేసారి
హైదరాబాద్: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాలలోను ఒకేసారి ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మేయర్లు, చైర్మన్ల ఎన్నిక కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. జూలై 3వ తేదీన మేయర్, చైర్మన్‌ల ఎన్నిక, జూలై 4న జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక, జూలై 5న వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది.

కాగా, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు చాలా రోజులు ముందే జరిగాయి. అయితే వాటి ఫలితాలు కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందే విడుదల కావాల్సి ఉండె. కానీ, ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల పైన పడుతాయని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వీటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాక విడుదలయ్యాయి.












Click it and Unblock the Notifications