ఇల్లు అద్దెకు తీసుకొని.. ఏలూరులో పవన్ కళ్యాణ్‌కు ఓటు హక్కు

ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనఓటు హక్కును పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో నమోదు చేయించుకున్నారు. గత నెల 17వ తేదీన ఓటు హక్కు వచ్చింది. పవన్ కళ్యాణ్‌కు టీడీజెడ్‌117567 నంబరుతో ఓటరు గుర్తింపు కార్డు వచ్చింది.

Recommended Video

    జనసేనలో చేరనున్న ముత్తా గోపాలకృష్ణ

    ఏలూరులోని పోస్టల్ కాలనీ ఇంటినెంబరు 27-21-19తో చిరునామాతో ఈ ఓటరు కార్డు మంజూరైంది. పోస్టల్‌ కాలనీలో ఓ ఇంటిని పవన్ కళ్యాణ్ అద్దెకు తీసుకున్నారని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి పోటీ చేయాలని పలువురు జనసేనానిని కోరుతున్నారు.

    Now, Pawan Kalyan have his voters ID in Andhra Pradesh

    కాగా, పవన్ కళ్యాణ్‌కు ఏపీలో ఓటు హక్కు లేదని విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో 27-21-19 ఇంటి నెంబరుతో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

    పవన్ కళ్యాణ్ ఆన్‌లైన్ ద్వారా ఓటు హక్కు కోసం అప్లయ్ చేసుకున్నారు. ఓటు హక్కు నమోదు చేయించుకోవడానికి 6ఏ ఫారం ద్వారా నేరుగా లేదా మీ సేవ కేంద్రాల ద్వారా లేదా ఆన్ లైన్ ద్వారా నమోదు చేయించుకునే అవకాశం ఉంది.

    ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, ఆ దరఖాస్తును రెవెన్యూ అధికారులు పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే ఓటు హక్కు కల్పించవచ్చని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేస్తారు. ఆ విధంగానే పవన్‌కు ఓటు హక్కు వచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+