వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కేబినెట్ ప్రక్షాళన-ఒకే పనిపై జగన్, చంద్రబాబు బిజీ-అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా !

|
Google Oneindia TeluguNews

ఏపీలో కేబినెట్ ప్రక్షాళన జరగబోతోంది. సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రక్షాళన చేయబోతున్నారు. ఇందులో చోటు దక్కించుకోబోయే వారిపై రోజుకో పేరు చక్కర్లు కొడుతోంది. జగన్ తెరవెనుక చేస్తున్న కసరత్తుపై లీకులు కూడా వస్తున్నాయి. అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబు కూడా కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెడుతున్నారు. రాజకీయంగా తమకు ఇది కచ్చితంగా కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు.

కేబినెట్ ప్రక్షాళన

కేబినెట్ ప్రక్షాళన


ఏపీలో కేబినెట్ ప్రక్షాళన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్తగా కేబినెట్ లో చోటు దక్కించుకోబోయే వారు, ప్రస్తుత కేబినెట్ లో కొనసాగే వారు, ఉద్వాసనకు గురయ్యే వారి విషయంలో ప్రతీ రోజూ కొత్త కొత్త పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. తెరవెనుక సీఎం జగన్ పలు సమీకరణాల ఆధారంగా కొత్త కేబినెట్ మంత్రుల పేర్లను సిద్ధం చేస్తుండగా.. ఇందులో చోటు దక్కించుకోవడం కోసం ఎమ్మెల్యేల లాబీయింగ్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. అయినా వారిలోనూ ఏదో ఒక అనుమానం. కేబినెట్ లో చోటు కోసం తామెన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా జగన్ నిర్ణయం తీసుకున్నాక అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిసిన ఎమ్మెల్యేలు .. తాము ఆశించిన విధంగా కేబినెట్ బెర్తు దక్కకపోతే ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

జగన్ భారీ కసరత్తు

జగన్ భారీ కసరత్తు

వైసీపీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టే కేబినెట్ ప్రక్షాళన అందరినీ మెప్పించలేకపోయినా కులాలు, సామాజిక వర్గాలకు మాత్రం ఎక్కడా నొప్పించకూడదనే ధోరణిలో జగన్ భారీ కసరత్తే చేస్తున్నారు. ఇందులో జిల్లాల వారీగా సామాజిక సమీకరణాలు, సీనియార్టీ, గతంలో ఇచ్చిన హామీలు అన్నీ కీలకమే. దీంతో ఎక్కడ తేడా వచ్చినా రాజకీయంగా భారీ నష్టం తప్పదనే అంచనాతో ఉన్న జగన్.. అవసరమైతే మరికొన్ని రోజులు ఆలస్యం చేసే యోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ ఎమ్మెల్యేల్లో మరింత అసంతృప్తి పెరగడం ఖాయమనే అంచనాలు కూడా ఉన్నాయి.

కేబినెట్ పై చంద్రబాబు వ్యూహాలు

కేబినెట్ పై చంద్రబాబు వ్యూహాలు

ప్రస్తుత కేబినెట్ లో ఒకరిద్దరు మినహా దాదాపు మంత్రులందరికీ ఉద్వాసన ఖాయంగానే కనిపిస్తోంది. అలాగే కొత్తగా మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్యకూడా జిల్లాల వారీగా భారీగానే ఉంది. దీంతో ఈ రెండు అంశాలపై చంద్రబాబు టీమ్ భారీగానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్తగా నియమించుకున్న వ్యూహకర్త సునీల్ కానుగోలు సాయంతో చంద్రబాబు పాత, కొత్త మంత్రులు, ఆశావహులు, బాధితులపై పూర్తివివరాలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. వీటి ఆధారంగా వీరిలో తమ పార్టీలోకి ఆకర్షించేందుకు అనువైన వారి కోసం వ్యూహరచన చేస్తున్నారు. దీంతో కేబినెట్ పై జగన్ తో పాటు చంద్రబాబు కూడా భారీగానే ఫోకస్ పెట్టినట్లు అర్ధమవుతోంది.

ఏమాత్రం తేడావచ్చినా !

ఏమాత్రం తేడావచ్చినా !


జగన్ కు సామాజిక వర్గాలు, ఇతర సమీకరణాల ఆధారంగా మంత్రివర్గం, పదవులు, టికెట్ల పంపిణీలో మంచి అనుభవం ఉంది. గతంలో ఇలాగే పలు నియోజకవర్గాల్లో ఎవరూ ఊహించని అభ్యర్ధులకు సైతం టికెట్లు ఇచ్చి తన హవాలో గెలిపించుకున్న చరిత్ర కూడా ఉంది. దీంతో ఈసారి కూడా కేబినెట్ ప్రక్షాళనపై తన మార్కు ఉండాలని జగన్ కోరుకుటున్నారు. అయితే ఇంత చేసినా అసంతృప్తుల గోల తప్పదు. వారికి ప్రాంతీయ మండళ్లు, ఇతర నామినేటెడ్ పదవులతో సరిపెట్టొచ్చనే అంచనాలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ దానికి వారు ఒప్పుకోకుండా మాత్రం ఎన్నికల ఏడాది నాటికి ఫిరాయింపుల పర్వం తప్పదనే వాదన వినిపిస్తోంది. మరి జగన్ చేసి కసరత్తు వైసీపీకి లాభిస్తుందా లేక టీడీపీకి లాభిస్తుందా అన్నది చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

English summary
ap cm ys jagan and opposition leader chandrababu are now focusing on cabinet reshuffle with their own reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X