భర్తని కాదని అమెరికా నుంచి ప్రియుడి కోసమొచ్చిన యువతి, సూసైడ్‌యత్నం
విజయవాడ: బెజవాడలో గురువారం నాడు ఓ యువతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ యత్నం చేసిన యువతి ఎన్నారై యువతిగా తెలుస్తోంది. ఆమె పేరు మానస అని సమాచారం.
మానస తన భర్తను కాదని, అమెరికా నుంచి తన ప్రియుడు హేమంత్ కోసం వచ్చారు. అయితే, తీరా ఆమె విజయవాడకు వచ్చాక అతను కనిపించలేదు. అతను పత్తా లేకుండ పోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అతడి కోసం ఫోన్ ద్వారా ప్రయత్నించింది.

కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయాన్ని గుర్తించిన ఆమె బంధువులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హేమంత్ కోసం ఫోన్ చేస్తే అతని కుటుంబసభ్యులు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications