ఎమ్మెల్యే రాజీనామా : 15 రోజుల్లో స్పందించకుంటే నిరహార దీక్ష : ప.గో లో కలకలం..!
ప్రభుత్వ తీరును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఎమ్మెల్యే రాజీనామా చేసారు. ప్రజలకు..జిల్లాకు ఇచ్చిన హామీ లను అమలు చేయటంలో విఫలమైందని ఆరోపించారు. 15 రోజుల్లోగా ముఖ్యమంత్రి స్పందించి..సమస్యల పరిష్కా రం పై దృష్టి సారించకుంటే ఆమరణ నిరహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
సీయంకు రాజీనామా లేఖ..

మాజీ మంత్రి..బిజెపి ఎమ్మెల్యే పైడి కొండల మాణిక్యాలరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు 56 హామీలు నెరవేర్చ నందుకే రాజీనామా చేస్తున్నట్టు మాణిక్యాల రావు వివరించారు. తన డిమాండ్ల పై 15 రోజుల్లోగా ముఖ్యమంత్రి చంద్ర బాబు స్పందించాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. తాడేపల్లిగూడెం నియోజవర్గానికి చెందిన పలు సమస్యల పరిష్కారానికై 3 నెలలుగా చంద్రబాబు చుట్టూ తిరుగతున్నా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. మంత్రి గా ఉన్న సమయంలోనూ అనేక అంశాలను ప్రభుత్వ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు.
వివక్ష కారణంగానే..
సెప్టెంబర్ లో టిడిపి తాడేపల్లి గూడెంలో ధర్మ పోరాట దీక్ష సభ నిర్వహించిందని..దీనికి ముందు రోజు తాము స్థానికు లతో కలిసి సమస్యల పై ర్యాలీ నిర్వహించామని గుర్తు చేస్తున్నారు. 14 సీట్లు గెలిపించిన జిల్లా పై టిడిపి అధినాయక త్వం వ్యవహరించే తీరు ఇదేనా అని నిలదీసారు. తన డిమాండ్ల పై 15 రోజుల్లోగా సీఎం స్పందించకపోతే 16వ రోజు నుంచి నిరాహారదీక్షకు దిగుతానని మాణి్యాల రావు హెచ్చరించారు. తన నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు సం బంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని పంపిస్తున్నానని.. ఇలాంటి శాసనసభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చారు. తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ లేనందుకే ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదని ఆరోపించారు. తనను తొలగించి అయినా సరే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని..తన రాజీనామాను మీరే స్పీకర్‌కు పంపించండి అని ముఖ్యమంత్రిని కోరారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications