సీఎం జగన్ ఫొటో పెట్టం: మా సీఎం ఇంకా ఆయనే : ఓ యూనివర్సిటీ అధికారుల నిర్వాకం..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించి 50 రోజులు పూర్తవుతోంది. కానీ, ఇంకా కొంత మంది ఉద్యోగులు మాత్రం గతంలో పని చేసిన వారే ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారనే భావనలో ఉన్నారు. ఏపీలోని అన్ని యూనివర్సిటీల్లో ప్రతీ వైస్ ఛాన్సలర్ల ఛాంబర్లలో ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటు చేసారు. అయితే స్వయంగా వీసీ ఆదేశించినా అక్కడ కొంత మంది అధికారులు మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఏర్పాటుకు ససేమిరా అంటున్నారు. గతంలో పని చేసిన ఆయనే తమ సీఎం అని చెబుతున్నారు.
జగన్ ఫొటో పెట్టమంటున్న సిబ్బంది..
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన ఫొటో ఏర్పాటు చేయటానికి ఇంకా కొన్ని చోట్ల అధికా రులకు మనసు అంగీకరించటం లేదు. తాజాగా..విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రాష్ట్ర ము ఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టేందుకు ప్రయత్నించగా కొంత మంది అడ్డుకుంటున్నారు. తన చాంబర్‌లో సీఎం జగన్ ఫొటో పెట్టాలని స్వయంగా హెల్త్ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ సీవీ రావు ఆదేశించినా సంబంధిత అధికారులు బేఖా తర్ అంటుననారు. ముఖ్యంగా వర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న కొంత మంది ఉద్యోగులు సీఎం ఫొటో పెట్టే విషయంలో కింది స్థాయి సిబ్బంది మీద ఒత్తిడి తెచ్చి జగన్ ఫొటో ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నట్లు వర్సిటీలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహారాలు నడిచాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం సైతం ఇక్కడ ఏర్పాటు చేసారు.

ఏంటీ ధిక్కార స్వరం..ఎందుకంటే
సీఎం ఫొటో పెట్టే విషయమై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాలేదంటూ కొందరు అధికారులు సాకులు చెబుతు న్నారు. అయితే యూనివర్సిటీ పక్కనే ఉన్న సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ప్రిన్సిపాల్ చాంబర్‌లో..విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సీఎం వైఎస్ జగన్ ఫొటో ఇప్పటికే ఏర్పాటు చేసారు. గత ప్రభుత్వంలో ఎక్కడా లేని విధంగా వర్సిటీలోనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన అధికారులే.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టేందుకు మనసొప్పక అడ్డుకుంటున్నారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. వర్సిటీలోని పరిపాలన, ఇంజ నీరింగ్ తదితర విభాగాల్లో కీలక పోస్టుల్లో పనిచేసే కొంత మంది అధికారులు, ఉద్యోగులు గత ముఖ్యమంత్రి మీద అమి తమైన మక్కువతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మరి..ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడి వ్యవహారాల పైన ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications