టీడిపిని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న ఎన్టీఆర్..! ప్ర‌జ‌ల్లోకి వ‌స్తే సహించేది లేదంటున్న త‌మ్ముళ్లు..!!

హైద‌రాబాద్ : ఎన్‌టీఆర్ సినిమా తెలుగుదేశం పార్టీకి అస్సెట్ గా మారే సంగ‌తి ప‌క్క‌న పెడితే తెలుగు త‌మ్ముళ్ల‌ను ఉసూరు మ‌నిపించింది. ఇప్పుడు అదే ఎన్‌టీఆర్ సినిమా టీడీపీ కి శ‌రాఘాతంలా ప‌రిణ‌మించింది. సంచ‌లనాల ద‌ర్శ‌కుడు వ‌ర్మ తెలుగు త‌మ్ముళ్ల క‌ర్మ కోసం తీశారా అనేంత‌గా మారిపోయింది సినిమా. దీనిలో ఎన్‌టీఆర్ జీవిత చ‌ర‌మాంకంలో చ‌విచూసిన అనుభ‌వాలు.. కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు.. అయిన‌వాళ్లు.. అన్న‌గారి ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు, వృద్ధాప్యంలో శారీర‌క వాంఛ‌ల‌కు అతీతంగా కేవ‌లం త‌న‌కు ఆ వ‌య‌సులో తోడుకావాల‌నే ఉద్దేశంతో చేసుకున్న పెళ్లిని ఎలా రాజకీయంగా వాడుకున్నార‌నే అంశాలు వ‌ర్మ కోణంలో తెర‌కు ఎక్కాయి. పైగా.. క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు సినిమాల‌కంటే, ఎన్‌టీఆర్ ల‌క్ష్మీస్‌పై ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ‌, ఆస‌క్తి నెల‌కొంది.

ntr movie threatening tdp..! tdp cadre warning that they cant spare if tt comes into public..!!

ఎన్నిక‌ల స‌మ‌యంలో దీన్ని విడుద‌ల చేయ‌టం, దీని ప్ర‌భావం ఏపీ ఫ‌లితాల‌పై ఉంటుంద‌నే భ‌యం తెలుగుదేశం పార్టీని ప‌ట్టిపీడిస్తోంది. దీనిపై గ‌తంలో కోర్టుల‌కు వెళ్లినా, ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసినా అనుకున్న ఫ‌లితం క‌నిపించ‌లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. వాక్‌స్వాతంత్ర‌పు హ‌క్కును హ‌రించే అధికారం త‌మ‌కు లేదంటూ తేల్చిచెప్పాయి. అయినా.. ఏదో మూల‌న ఆశ‌తో టీడీపీ ఆ సినిమాను నిలుపుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. క‌నీసం పోలింగ్ తేదీ వ‌ర‌కూ ఆపితే చాలంటూ ఎన్నిక‌ల సంఘానికి మొరపెట్టుకునే స్థాయికి దేశం నేత‌లు చేర‌టం, వ‌ర్మ‌. తీసిన ఎన్‌టీఆర్, తెలుగుదేశాన్ని ఎంత‌గా ద‌డ పుట్టిస్తుందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఏపీలో తామే అధికారంలోకి వ‌స్తామ‌ని గొప్ప‌లు చెబుతున్న టీడిపి శ్రేణులు కేవ‌లం మూడు గంట‌ల సినిమా విడుద‌ల‌ను ఆపాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+