వివాదానికి తెర!: ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించారు
అమరావతి: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని రహదారులపై ఉన్న పలు విగ్రహాలను ఇప్పటికే ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా స్థానిక మ్యూజియం సెంటర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది.'ఏంటిది?:
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయాక రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారు. రాష్ట్రంలో ఎటువంటి విగ్రహాల అనుమతికి అవకాశం లేకపోయినా అధికార దర్పంతో కొందరు నాయకులు స్థానిక నాయకుల అండదండలతో ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

అంతేగాక, ఈ విగ్రహం ఏర్పాటుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించి స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.
ఈ విగ్రహం ఏర్పాటు కాస్త చినికి చినికి గాలివానలామారి టిడిపి కమాండ్ దృష్టికెళ్లడం, మెయిన్‌రోడ్డులో ఆర్‌అండ్‌బి, రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం వల్ల విగ్రహాన్ని తొలగించివేశారు. ఎట్టకేలకు ఎన్‌టిఆర్ విగ్రహం తొలగించడంతో కృష్ణా పుష్కరాల సందర్భంగా వివాదం ఏర్పడుతుందేమోనన్న సమస్య సానుకూలంగా పరిష్కారమైంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications