మహిళా నేత ఫోన్‌కు అసభ్యకర సందేశాలు, వ్యక్తి అరెస్ట్

2007లో భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా గతంలో ఇతని పైన జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయింది. అనంతరం వీరు విడివిడిగా ఉంటున్నారు. రామలింగం సెల్‌ఫోన్ నుండి అడ్డగుట్ట బీ సెక్షన్‌కు చెందిన మహిళా నాయకురాలు ఫోన్‌కు కొద్ది రోజులుగా అసభ్యకర సందేశాలు వెళ్తున్నాయి.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బోయినపల్లి సుచిత్ర రహదారిలో రామలింగంను అదుపులోకి తీసుకున్నారు. అతనిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
దారిదోపిడీ నిందితుల ఊహాచిత్రాలు విడుదల
తుపాకీతో బెదిరించి తండ్రీకొడుకుల వద్ద రూ.3.49 లక్షలు తస్కరించిన నిందితుల ఊహాచిత్రాలను పోలీసులు గురువారం విడుదల చేశారు.
సంతోష్‌నగర్, రక్షాపురం టీ జంక్షన్ సమీపంలో బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న అరుంధతీ కాలనీకి చెందిన వంగాల బాలరాజు, అతని కుమారుడు రాజేష్ కుమార్‌ను బుధవారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి తుపాకితో కాల్పులు జరిపి డబ్బు దోచుకెళ్లిన విషయం తెలిసిందే.
విచారణ చేపట్టిన పోలీసులు బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నిందితుల ఊహాచిత్రాలను రూపొందించారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.












Click it and Unblock the Notifications