వైసీపీ ఎమ్మెల్యే బర్త్ డే వేడకలు - అశ్లీల నృత్యాలు..!!
వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరి తీరు వివాదస్పదంగా మారుతోంంది. కొందరు తమ వ్యాఖ్యలతో.. మరి కొందరు తమ వ్యవహార శైలితో చర్చకు కారణమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీలో ఉంటూ.. పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించటం లేదంటూ అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు మరోసారి వివాదస్పదం అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఇప్పుడు ఈ వివాదానికి కారణమవుతోంది. దర్శి నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా మద్దిశెట్ట వేణుగోపాల్ గెలుపొందారు.
ఆయన జన్మదినం కావటంతో అనుచరులు భారీగా నిర్వహించారు. అయితే, ఆ వేడుకల్లో అర్ద్రరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. కొందరు ఎమ్మెల్యే అనుచరులు సైతం వారితో కలిసి డాన్స్ చేయటం మరింత వివాదానికి కారణమవుతోంది. స్థానికంగా ఉన్న అధికారులు ఎవరూ ఈ విషయం తెలిసినా.. నివారించే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వైపు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించి ఒక వీడియో వివాదం కొనసాగుతోంది. అయితే, ఇదంతా టీడీపీ చేస్తున్న కుట్రగా ఎంపీ మాధవ్ ఖండించారు. వీడియో లను మార్ఫింగ్ లు చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రంగా మాధవ్ పేర్కొన్నారు.

దీని పైన పోలీసు ఉన్నతాధికారుల కు ఫిర్యాదు చేసారు. టీడీపీలో కొందరి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు, తాను ఏ విచారణకు అయినా సిద్దమని స్పష్టం చేసారు. దీని పైన టీడీపీ..బీజేపీ మహిళా నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలా, వరుసగా వైసీపీ ప్రజా ప్రతినిధులు వివాదాల్లో చిక్కుకోవటం ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..పార్టీకి రాజకీయంగా ఇబ్బంది కరంగా మారుతోంది. టీడీపీకి అస్త్రాలుగా మారుతున్నాయి. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారాల పైన వైసీపీ అధినాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది పార్టీలో చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications