వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్ పోన్ సిగ్నల్స్ ద్వారా 15 రోజులుగా మావోల కదలికలపై పోలీసుల నిఘా

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం :మావోయిస్టు కీలక నాయకుడు రామకృష్ణ ను మట్టుబెట్టేందుకు పోలీసులు 15 రోజులపాటు ప్లాన్ చేశారు.కాని,ఈ ప్లాన్ ప్రకాంరగా పోలీసులు ఎన్ కౌంటర్ కు పాల్పడ్డారు అయితే రామకృష్ణ ఈ ఘటనలో తప్పించుకొన్నారు. కీలకమైన ఇద్దరు నాయకులు సహా 24 మంది మావోలు మృత్యువాత పడ్డారు.

మావోయిస్టు లను మట్టుబేట్టేందుకుగాను పోలీసులు పక్కా వ్యూహాన్ని రూపొందించారు.ఈ వ్యూహం ప్రకారంగానే వ్యవహారించారు.ఏఓబీ సరిహద్దులోని గుమ్మ అటవీ ప్రాంతంలో జల్లెడపట్టారు. మావోల సమాచారాన్ని రాబట్టారు.ఇన్ ఫార్మర్లకు టెక్నాలజీని జమకూర్చారుమావోల జాడను ఖచ్చితంగా తెలుసుకొన్నారు.నెల రోజుల క్రితమే రామకృష్ణ ఏఓబి కి వచ్చారు.దీంతో ఆయనను లక్షంగా చేసుకొని పోలీసులు ప్లాన్ చేశారు.

ఎన్‌కౌంటర్ ఫొటోలు

నెల క్రితమే దండకారణ్యం నుండి రామకృష్ణ ఏఓబికి వచ్చారు.ఈ సమాచారం అందుకొన్న పోలీసులు ప్లాన్ వేశారు.భూ నిర్వాసితులు, గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయాలనేది మావోయిస్టు పార్టీ వ్యూహాంగా పోలీసులు అనుమానిస్తున్నారు.కేంద్రకమిటీ ఈ మేరకు సర్కులర్ పంపింది.కోరాపూట్ ప్రాంతానికి నెల రోజు ల క్రితం రామకృష్ణ వచ్చినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది.

odisha encounter: 15 days plan

ఇన్ ఫార్మర్లను బలోపేతం చేశారు పోలీసులు. అక్టోబర్ 20 నుండి 26 వరకు ఏఓబి పరిధిలో మావోయిస్టు ఉద్యమ కార్చాచరణ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించాలని తలపెట్టారు.గుమ్మ అటవీ ప్రాంతాన్ని ఎంచుకొన్నారు.ఈ నెల 18న , గ్రామ రక్షణ దళంతో పాటు, మిలిషీయను మావోలు అప్రమత్తం చేశారు.ఈ నెల 19వ, తేది నుండి ఎస్ ఐ బి అధికారులు గుమ్మ అటవీ ప్రాంతంలోని సెల్ టవర్లను తమ ఆధీనంలోకి తీసుకొన్నాయి.

గుమ్మ అటవీ ప్రాంతంలోని ఇన్ ఫార్మర్లకు అత్యాధునిక సెల్ ఫోన్లను సమకూర్చారు.ఈ ఫోన్లకు జిపిఎస్ ట్రాకింగ్ ను అమర్చారు.మావోల సమావేశానికి వచ్చిన ఇద్దరు కీలక నేతల వద్ద సెల్ ఫోన్ లు ఉన్నట్టు గుర్తించారు.ఈ నెల 23వ, తేదిన ఆర్ కె, గణేష్ ఇతర కీలక నేతలు సమావేశానికి వచ్చారని గుర్తించారు పోలీసులు.ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు ఎన్ కౌంటర్ కు పాల్పడ్డారు.

English summary
police pre plan to odisha an encounter before 15 days. maoist top leader ramakrishna reach aob area before one month.so police plan to target ramakrishna.police taken help from maoist sympathysers withe new chronology cellphones.police trace out the maoist place through the cell phones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X