రైల్వే కీలక ప్రకటన - టికెట్ లేని ప్రయాణీకులకు నష్ట పరిహారం..!!
రైల్వే శాఖ కీలక ప్రకటన చేసిది. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో టికెట్ లేని ప్రయాణీకులకు నష్ట పరిహారం లభించనుంది. గతంలో ప్రమాదాలు జరిగిన సమయంలో..ఇతర సందర్భాల్లో రైల్వే నుంచి పరిహారం అందాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్..లేదా ప్రయాణం టికెట్ ఉంటేనే అమలు చేసేవారు. ఇప్పుడు ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.
పరిహారం పై ప్రకటన:గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణీకులకు టికెట్ ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా ప్రమాదానికి గురైన వారిందరికీ పరిహారం అందుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేసారు. మృతి చెందిన, గాయపడిన వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు హెల్ప్ లైన్ నెంబర్ 139కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. మృతదేహాలు తీసుకెళ్లేందుకు బాధిత కుటుంబ సభ్యులు వస్తామంటే తమకు ఫోన్ చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణానికి, ఇతరత్రా అయ్యే ఖర్చులను తామే భరిస్తామని రైల్వే ప్రకటించింది. ఇప్పటికే ఒడిశాలోని పలు ఆస్పత్రుల్లో ఉంచిన మృతదేహాలను బంధువులు గుర్తించిన వెంటనే అప్పగిస్తున్నారు.

మృతదేహాలు గుర్తింపు:ఈ రైలు ప్రమాదం కుట్రగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అనుమానం వ్యక్తం చేసారు. అటు రైల్వే బోర్డు ఈ దుర్ఘటన పైన సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఈ ప్రమాదంలో 275 మంది మరణించినట్లు ఒడిశా ప్రభుత్వ ప్రధాక కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. అయితే, సంక్లిష్టంగా మారిన మృతదేహాలు గుర్తింపు సమస్యను అధిగమించేందుకు వివరాలను రైల్వే అధికారిక వెబ్ సైట్లలో ఉంచారు. ఇప్పటి వరకు 57 మందిని గుర్తించి పోస్ట్ మార్టం తర్వాత బంధువులకు అప్పగించారు. భువనేశ్వర్ లో 172 మృతదేహాలను ఉంచారు. ఎయిమ్స్ లో 100, ఎస్ యూ ఏం 20, కిమ్స్ లో 20, ఏ ఎం అర్ ఐ లో 6, క్యాపిటల్ హాస్పిటల్ లో 16 ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ తెలుగు ప్రయాణీకులకు మెరుగైన వైద్యం కోసం విశాఖ కు తరలించారు.
రైళ్లు రద్దు..దారి మళ్లింపు:రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసం అయింది. ఒక లైన్ యుద్దప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చారు. 52 గంటల శ్రమ తరువాత ఒక లైన్ లో రైళ్ల రాకపోకలను ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఈ రైలు ప్రమాదంతో 123 రైళ్లను రద్దు చేసారు. 56 దారి మళ్లించారు. పది రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రద్దైన వాటిలో హౌరా - చెన్నై మెయిల్, కన్యాకుమారి - హౌరా ఎక్స్ ప్రెస్, షాలిమార్ ఎక్స్ ప్రెస్, తిరుపతి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ , ఎస్ఎంవీటటీ - బెంగళూరు సూపర్ ఫార్ట్ ఎక్స్ ప్రెస్ ఉన్నాయి. 9వ తేదీ నుంచి తిరిగి రైళ్ల రాకపోకలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications