Mega DSC: ఏపీలో పాత DSC రద్దు..త్వరలో టెట్..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ(DSC) నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256 జారీ చేసింది. త్వరలో మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీని ప్రకటించింది.
ఒకటి, రెండు రోజుల్లో 16,347 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. గత ప్రభుత్వంలో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సమయం పట్టింది. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం.. ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ వేసేందుకు సిద్ధమైంది. డీఎస్సీ నిర్వహించేకంటే ముందే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

జులైలో టెట్ కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. టెట్-2024కు సంబంధించి షెడ్యూల్, నోటిఫికేషన్, ఇన్ఫర్మెషన్ బులిటెన్, సిలబస్, ఆన్ లైన్ లో జరిగే పరీక్షలపై జులై 2న ప్రకటన చేసే అవకాశం ఉంది. https://cse.ap.gov.in/ వెబ్ సైట్ వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. కాగా మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌లోనూ మెగా డీఎస్సీ నిర్వహణకు ఆమోదం కూడా తెలిపారు.
ఏపీలో కొద్ది రోజుల క్రితం టెట్ నిర్వహించారు. వాటికి సంబంధించి ఇప్పటి ఫలితాలను విడుదల చేశారు. తాజాగా మరోసారి టెట్ నిర్వహించనున్నారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications