సీఎం జగన్ యాత్ర పై నిఘా - కీలక నిర్ణయాలు..!!
ఏపీలో ఎన్నికల సంగ్రామం కీలక దశకు చేరింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ప్రధాన నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయవాడ కేంద్రంగా జగన్ పైన జరిగిన రాయి దాడి సంచలనంగా మారింది. దీని పైన విచారించిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజకీయంగా దుమారానికి కారణమైంది. ఈ ఘటన తరువాత పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జగన్ యాత్ర పైన నిఘా పెంచింది. భద్రతలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జగన్ పైన దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. విజయవాడ సెంట్రల్ కు చెందిన దుర్గారావు, సతీష్ ఈ దాడికి కారుకులుగా చెబుతున్నారు. వీరిని పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. సిమెంట్ రాయి ముక్కతో దాడి చేసినట్లు నిర్దారించారు. జగన్ పైన దాడిని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. వీఐపీల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించింది. దీంతో, జగన్ భద్రతలో భాగంగా ఇప్పటికే యాత్రలో గజమాలలు, పూలు వేయటాన్ని అధికారులు నిషేదించారు. అదే విధంగా బస్సు కు ముందు వంద అడుగుల వరకు రోప్ పార్టీతో రక్షణ ఏర్పాటు చేసారు.

రాత్రి సమయాల్లో బస్సు పైన నుంచి యాత్రలో పాల్గొనకండా షెడ్యూల్ రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు. ఇప్పుడు తాజాగా మరికొన్ని చర్యలు చేపట్టారు. జగన్ బస్సు యాత్ర పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సీసీ కెమేరాలతో ఒక వాహనం కొనసాగనుంది. 360 డిగ్రీల కోణంలో ఈ కెమేరా వ్యవస్థ పని చేయనుంది. సీసీ కెమేరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులు పూర్తిగా యాత్రను పర్యవేక్షించనున్నారు.
బస్సు యాత్ర తరువాత ఈ నెల 25వ తేదీ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనన్నారు. పులివెందులలో నామినేషన్ దాఖలు చేసి ఆ వెంటనే అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. మరుసటి రోజు నుంచి మే 9వ తేదీ వరకు ప్రతీ రోజు మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్దం చేస్తున్నారు. జగన్ ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకూ ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రజలతో కలవటంతో మాత్రం ఎలాంటి మార్పు లేదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications