• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అదుగో.. వ‌ర్మ మ‌ళ్లీ ఏసాడు..! ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి ఆయ‌నేన‌ట‌..!!

|

హైద‌రాబాద్ : త‌ల- తోక కి సంబందంలేకుండా సెల‌బ్రిటీల మీద స్టేట్ మెంట్ లు ఇస్తూ నాలుగురోజులు మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఈ సారి కూడా దాదాపు అలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే చేసారు. కాక‌పోతే ఆయన‌ స్టీరింగ్ ఈ సారి రాజ‌కీయ నాయ‌కుల వైపు తిరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంద్ర‌ప్ర‌దేశ్ నుండి ఆయ‌న ముఖ్య‌మంత్రి అవుతార‌ని జోకేసారో.., జోష్యం చెప్పారో.., అభిమానం చాటుకున్నారో తెలియ‌దు కాని ఓ ప్ర‌క‌ట‌న మాత్రం చేసి పారేసారు.

కాపీపై టీడీపీ ఏమన్నదంటే? జగన్‌కు షాకిచ్చిన చంద్రబాబు, టీడీపీకి ఇవీ ప్లస్‌లు

ఉన్న ప‌ళంగా ఆయ‌నే ముఖ్య‌మంత్రి అంటూ చెప్పేస ఏపీ రాజ‌కీయాల్లో దుమారం రేపారు. ఎవ‌రి మీదైనా సెటైరిక‌ల్ గా పంచ్ లు వేసే వ‌ర్మ సీరియ‌స్ గా ఆ స్టేట్ మెంట్ ఇచ్చాడా? లేక యెట‌కారం ప్ర‌ద‌ర్శించాడా..? ఇంత‌కీ వ‌ర్మ ఎవ‌రిని కాబోయే ముఖ్య‌మంత్రి అన్నారు..? ఎందుకా ప్ర‌క‌ట‌న ఇవ్వాల్సి వ‌చ్చింది.? తెలుసుకుందాం..!!

Oh .. He is the future Chief Minister of AP ..! Varma satirical tweet..!!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచ‌ల‌నానికి తెర‌తీసారు. ఏపి ముఖ్య మంత్రి పీఠం పై బాంబు పేల్చాడు. ప్ర‌జా శాంతి పార్టీ అదినేత కేఏ పాల్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అని రాజ‌కీయ ర‌ణ రంగంలో ఓ అస్త్రం వ‌దిలారు. ఏపీలోని 175 స్థానాలకు గానూ 175 స్థానాల్లో ఆయన పార్టీ విజయం సాధిస్తుందని వర్మ ట్వీట్ చేశాడు. యేసు క్రీస్తు తర్వాత ప్రపంచలోనే అత్యంత గొప్ప వ్యక్తి కేఏ పాల్ అని వర్మ సెటైర్ విసిరారు. ప్రధాని మోదీతో పాల్ కలిసి ఉన్న ఫొటోను జతచేసి మరీ ట్వీట్ చేశాడు.

అంతటితో ఆగని వర్మ, ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రానికి లీడర్ అవ్వడానికి బదులుగా.. చంద్రబాబు, వైఎస్ జగన్, నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ లాంటి చిన్న వ్యక్తులతో పోటీకి బదులుగా.. తన స్నేహితుడు జీసస్ క్రైస్ట్‌ను అడిగి ప్రపంచ ఎన్నికలు జరిగేలా చూసి.. ప్రపంచ నేతగా కేఏ పాల్ ఎదగాలని రాంగోపాల్ వర్మ ఆకాంక్షించారు. దీంతో వ‌ర్మ కు ప్ర‌జాశాంతి అద్య‌క్షుడు కేఏ పాల్ మీద ఉన్న ప్రేమ క‌న్నా క‌సి ఎక్కువాగా ఉన్న‌ట్టు తెలుస్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పోస్టు చేయ‌డం కొస‌మెరుపు..!!

English summary
The sensational director Ramgopal Verma opened another sensation. The Praja Shanthi Party in the political field that it was the future Chief Minister of the KA Paul. Verma tweeted that his party will win in 175 seats for the 175 seats in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X