వామ్మో.. 'మార్కులు వేయకపోతే..మా తాతతో చేత చేతబడి చేయిస్తా..!'
పరీక్ష జవాబు పత్రాల్లో విద్యార్థులు తమను పాస్ చేయాలని అభ్యర్థిస్తూ రాసే సమాధానాలు చాలానే చూశాం. తమకు పాస్ మార్కులు వేయాలని జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టడం, తమ కుటుంబ పరిస్థితులను వివరించడం ఇలా అనేక మార్గాల్లో వేడుకోలు చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ తరహా ఘటనలు ఉత్తరాదిలో ఎక్కువగా కనిపించేవి. తాజాగా, ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని పదోతరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం సమయంలో అరుదైన ఘటన వెలుగు చూసింది. ఓ విద్యార్థి తెలుగు పరీక్ష జవాబు పత్రంలో నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా.. అంటూ బెదిరిస్తూ రాసిన వాక్యం ఇప్పడు ఏపీలో హాట్‌టాఫిక్‌గా మారింది. ఏపీలోని బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అనే ప్రశ్నకు ఒక విద్యార్థి 'నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా' అని రాయడంతో మూల్యాంకనం చేస్తోన్న టీచర్ ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే తేరుకుని సదరు విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేశారు.

తెలుగు భాషపై అవగాహన..
ఆ పరీక్ష పత్రాన్ని పరిశీలించిన అధికారులు సైతం అవాక్కయ్యారు. అందుకు కారణం ఆ విద్యార్థి రాసిన సమాధానం కాదు, ఆ సబ్జెక్టులో సదరు విద్యార్థికి వందకు 70 మార్కులు వచ్చినట్లు గుర్తించారు. ఇలాంటి అనుభవమే మరో జవాబు పత్రంలో కూడా ఉపాధ్యాయులకు ఎదురయ్యింది. మరో జవాబుపత్రంలో రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు.. 'మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది' అని రాసి ఉంది. ఈ తరహా సమాధానాలను కళ్లారా చూసిన ఉపాధ్యాయుడు విద్యార్థులకు తెలుగు భాషపై ఉన్న అవగాహనపై చర్చించుకుంటున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications