Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దుర్గాదేవిగా భక్తులకు అభయం - భారీగా క్యూలైన్లు, కీలక సూచనలు..!!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో ఎనిమిదో రోజు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో యాత్రికులకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భధ్రత ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రగిరిలు ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత సంతరించుకున్నాయి.

శ్రీ దుర్గా దేవి అవతారంలో ఇంద్రకీలాద్రిపై దర్శనమిస్తున్న అమ్మవారిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం క్యూలైన్ల ద్వారా వినాయక గుడి దగ్గర నుండి పైకి చేరుకుంటున్నారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కి తరలివస్తున్నారు. దుర్గగుడు అనే రాక్షసుడు ని అష్టమి తిధి రోజున సంహరించిన రోజు కాబట్టే అమ్మవారు శ్రీ దుర్గా దేవిగా కీర్తిస్తారు. అమ్మవారిని దుర్గాష్టమి నాడు ఆరాధించడం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. దుర్గాదేవి నామాన్ని స్మరించినా, ప్రార్ధించినా, జపించినా అమ్మవారు కష్టం, దరిద్రం లేకుండా సంపదలను, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

On the eighth day of the festival, Goddess appeared to the devotees as Durga Devi on Sunday at Indrakeeladri

పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎర్ర పుస్తకం, ఎర్రని దుస్తులతో చిత్రాన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తూ, అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున నేడు పూజిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం తో ఆలయ పాలక మండలి..అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రతీ ఒక్కరికి దర్శనం జరిగేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. దర్గమ్మను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్ని కేసులు బనాయించిన కడిగిన ముత్యంలో చంద్రబాబు బయటకు వస్తారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+