ఓటర్స్ డే సందర్భంగా...ఏపీ సచివాలయ ఉద్యోగుల ప్రతిజ్ఞ
అమరావతి: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సచివాలయంలోని ఉద్యోగులు ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. 1వ బ్లాక్ గ్రీవెన్స్ హాల్ లో గురువారం ఉదయం ఎపి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సచివాలయం ఉద్యోగులు చేత ఈ ప్రమాణం చేయించారు.
"భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము' అని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.













Click it and Unblock the Notifications