రేప్ కేసులో జైలుకెళ్లి, చైన్ స్నాచింగ్‌కు యత్నించి...

అంగడిపేట గ్రామంలో స్నాచింగ్‌కు యత్నించి గ్రామస్తులకు చిక్కిన వ్యక్తి షాపూర్‌నగర్‌కు చెందిన పెయింటర్ కొప్పుల కృష్ణప్రతాప్‌గా గుర్తించారు. ఇతను పార్శిగుట్ట తదితర ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలో అత్యాచారం కేసులో జైలుకు వెళ్ళి ఆరు నెలల శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు.
అంగడిపేట్‌లో నివాసం ఉంటున్నసంతోషిణి (25) అనే మహిళ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో పిల్లలకు అన్నం తినిపిస్తోంది. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలోని బంగారాన్ని లాక్కెళ్ళేందుకు ప్రయత్నించారు. ఆమె అరవడంతో గొంతు నులిమే ప్రయత్నం చేశారు. భయపడ్డ సంతోషిణి పిల్లలు పెద్దగా కేకలు వేయడంతో ఆగంతుకులు పరుగెత్తారు. స్థానిక యువకుడు గమనించి వారిలో ఒకరిని పట్టుకొన్నాడు. గ్రామస్తులు అతడిని చితకబాదారు.
సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ ఎస్సై కోటేశ్వరావు సిబ్బందితో అక్కడికి చేరుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాధితురాలు సంతోషిణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications