జగన్ రోడ్ షోతో ట్రాఫిక్, వ్యక్తి మృతి! కర్నూల్లో మరదలిని ఎత్తుకెళ్లిన బావ

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు షో సందర్భంగా ఓ విషాదం చోటు చేసుకుంది. జగన్ రోడ్డు షో వల్ల అరగంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి, దీంతో ఓ అంబులెన్సులోని రోగి మృతి చెందాడని సమాచారం.

జగన్ రోడ్డు షో అనంతపురం జిల్లాలోని కూడేరులో సాగుతోంది. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనాలు నిలిచిపోయాయి. ఆ ట్రాఫిక్ జాంలో ఓ అంబులెన్స్ కూడా నిలిచిపోయింది. దీంతో అందులోని రోగి మృతి చెందాడు. అతను కణేకల్ మండలం హనుమాపురంకు చెందిన పాపన్నగా తెలుస్తోంది.

One dead in Ananthapur after traffic jam

కర్నూలు జిల్లాలో మరదలిని ఎత్తుకెళ్లిన బావ

కర్నూలు జిల్లాలో ఓ బావ తన మరదలిని ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. ఆమెకు మరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో బావ ఆమెను ఎత్తుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

యువతి కొడుమూరుకు చెందినదిగా తెలుస్తోంది. ఓ వ్యక్తితో పెళ్లి కుదరడంతో వెంటి ఆభరణాలు కొనేందుకు ఆమె గోనెగొండ్లకు వచ్చింది. అక్కడి నుండి బావ ఆమెను ఎత్తుకెళ్లాడు. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+