కేసీఆర్ ప్లాన్ వెనుక..!: పవన్ అభిమాని ఒకరు, కాంపిటీటర్ ఒకరు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, నితిన్‌లను హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించాలనే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. పలు కోణాల్లో ఆలోచించి వారిని బ్రాండ్ అంబాసిడర్‌ల కోసం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తాను సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని అని కేసీఆర్ కొద్ది నెలల క్రితం ఓ సందర్భంలో చెప్పారు. అదే సమయంలో హైదరాబాదులో ఫిల్మ్ సిటీ అద్భుతంగా నిర్మిస్తామని, బోర్డులోకి హీరో కృష్ణను తీసుకుంటామని చెప్పారు కూడా. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నాలుగు వేల ఎకరాల్లో అద్భుతమైన ఫిలిం సిటీనిన నిర్మిస్తామని, ఫిలిం సిటీ బోర్డులో కృష్ణను సభ్యుడిగా నియమిస్తామని కేసీఆర్ సెప్టెంబరు నెలలో చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో పద్మాలయ స్టూడియో పైన వివాదం చెలరేగింది. తెలంగాణ వచ్చాక మంత్రి హరీష్ రావు, తెరాస పద్మాలయ పైన ప్లేటు పిరాయించిందని విపక్ష నేతలు కొందరు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. కృష్ణ మాట్లాడుతూ.. ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులే ముందుంటారు. పవన్ కళ్యాణ్ తెరాస ప్రత్యర్థి పార్టీలు అయిన టీడీపీ - బీజేపీలకు మద్దతుగా నిలబడుతున్నారు.
పవన్, చిరంజీవి.. ఇలా హీరోలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓ పార్టీ వైపు ఉన్నారు. మహేష్ బాబు వివాదరహితుడు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లోను మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ పోటీ చేశారు.
మహేష్ బాబు పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఓ పార్టీ వైపు మొగ్గవద్దనే ఉద్దేశ్యంతో ప్రచారానికి దూరంగా ఉండి ఉంటారంటున్నారు. ఇవి కూడా మహేష్ బాబు పేరు పరిశీలించడానికి కారణంగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక నితిన్ పేరు పరిశీలకు... ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హీరో. నితిన్ పవన్ అభిమాని కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications