ఒక్కొక్కరికి లక్ష.. 400 గ్రామాల ప్రజలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిబద్ధతకు హ్యాట్సాఫ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో వరద బాధితుల సహాయం కోసం భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న 400గ్రామపంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున మొత్తం నాలుగు కోట్ల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20 కేంద్రాలలో పంచాయతీల విరాళం పంపిణీ
నేడు ఈ గ్రామ పంచాయతీలకు సహాయమందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాలలో నిర్వహించనున్నారు.
ఇటీవల రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలకు వరదలలో చిక్కుకున్న ఆరు జిల్లాలలోని 400 పంచాయతీలకు ఈ విరాళం సొమ్మును నేరుగా పంచాయతీలకే అందించే కార్యక్రమాన్ని నేడు సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాలోని పంచాయతీ సర్పంచ్ లు, కార్యదర్శులు వచ్చి విరాళాన్ని అందుకోనున్నారు.

ఎవరూ ఇవ్వని విధంగా పవన్ కళ్యాణ్ వరద సాయం
ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నాయకులతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి తగు సూచనలు చేశారు. రాష్ట్రంలో మరే ఇతర నాయకులు ఇవ్వని విధంగా పవన్ కళ్యాణ్ వరదల సమయం లో సొంత నిధులను, తన కష్టార్జితాన్ని పంచాయతీలకు ఇవ్వడం గొప్ప విషయమని ఈ సాయం ఎంత విలువైనదో అందరం గ్రహించాలని ఆయన పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలకు ఉపయోగపడేలా పవన్ సాయం
తాను అందిస్తున్న సాయం ఆయా గ్రామ పంచాయతీలకు ఉపయోగపడాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశం అని తెలిపిన నాదెండ్ల మనోహర్ 20 చోట్ల ఈరోజు నిర్వహించే కార్యక్రమాలలో ప్రతి చోటా ప్రోటోకాల్ ప్రకారం కూటమి నాయకులను కూడా ఆహ్వానించి అధికారులకు కూడా సమాచారం ఇచ్చి నిర్వహించాలని తెలిపారు.
పవన్ కళ్యాణ్ నిబద్ధత ఇది. అందరికీ తెలియాలన్న మంత్రి నాదెండ్ల
పవన్ కళ్యాణ్ గ్రామపంచాయతీల పట్ల ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తున్నారు.. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా పనిచేస్తున్నారు.. ఎంత నిజాయితీగా ప్రజలకు అండగా ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం పార్టీ శ్రేణులు పైన ఉందన్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.
సర్పంచులకే మొదటి ప్రాదాన్యత
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న కారణంగా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, అందరినీ సమిష్టిగా కలుపుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. వరద సాయాన్ని నేరుగా అందించే ఈ కార్యక్రమంలో సర్పంచులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తెలిపారు.పవన్ కళ్యాణ్ అందిస్తున్న ఈ సాయాన్ని గ్రామ ఆస్తుల పరిరక్షణకు పారిశుద్ధ్యనికి ఆరోగ్య శిబిరాలను నిర్వహించడానికి ఇతర అవసరాలకు ఉపయోగించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ అంటున్న 400 గ్రామాల ప్రజలు
మొత్తం 400 గ్రామపంచాయతీలకు నేరుగా నేడు పవన్ కళ్యాణ్ వరద సాయం అందించనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం దాతృత్వానికి ఆయా గ్రామాల ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా పని చేసిన మంత్రిని చూడలేదని వారు కితాబిస్తున్నారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications