కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు - ఎప్పటి వరకు..!!
మరోసారి ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కొంత కాలం క్రితం ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం ప్రభుత్వాలే ఉల్లి ధరలకు పతనం అయ్యాయి. ఇప్పడు మార్కెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతొ ఉల్లి ధరలు మరోసారి పెరిగాయి. నిన్న మొన్నటి వరకూ కిలో ఇరవై నుంచి ముప్పయి రూపాయలు పలికిన కిలో ఉల్లి ధర ఇప్పుడు యాభై రూపాయలకు చేరుకుంది. మరి కొద్ది రోజులు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. మొన్నటి వరకూ టమాటా ధరలు చుక్కలుచూపించగా, ఇప్పుడు ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ కిలో ఇరవై నుంచి ముప్పయి రూపాయలు పలికింది. ఇప్పుడు హైదరాబాద్ తో సహా ఏపీలో విశాఖ, విజయవాడ, కర్నూలు మార్కెట్ లోనూ రూ 50 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో వ్యాపారులు ప్రస్తుత డిమాండ్ ను సొమ్ము చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం ధరలు పెరగటానికి ప్రధాన కారణం ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఉల్లిపాయల ధరలు సెప్టంబరు నుంచి పెరుగుతుంటాయి. కానీ ఒకనెల ముందుగానే షాకిస్తుంది. మహారాష్ట్రలో ఉల్లిపంట దెబ్బ తినడంతో పాటు దిగుమతి కూడా తగ్గింది. కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
కర్నూలు జిల్లాలో ఉల్లిసాగు ఎక్కువగా ఉంటుంది. కానీ ఏటా 30 వేల హెక్టార్లల పండే ఉల్లి ఈసారి తొమ్మిది వేల హెక్టార్లకే పరిమితమయ్యింది. కర్నూలు ఉల్లి మార్కెట్ లో క్వింటాల్ ధర మూడు వేల రూపాయల ఐదు వందల రూపాయల వరకూ పలుకుతుంది. అయితే, నెలాఖరు వరకు ఉల్లి ధరలు అధికంగా ఉంటాయని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications