ఆన్‌లైన్ సెక్స్ రాకెట్: విశాఖలో హైదరాబాద్ వ్యక్తితో పాటు యువతుల అరెస్ట్

విశాఖ: ఏపీలోని విశాఖ జిల్లాలో హైటెక్ వ్యభిచార ముఠా వెలుగు చూసింది. దీని నిర్వాహకుడు హైదరాబాదులోని అమీర్ పేటకు చెందిన నీలకంఠ రెడ్డి. అతనితో పాటు ముగ్గురు యువతులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.

వైజాగ్ కాల్ గర్ల్స్ పేరుతో అతను ఓ వెబ్ సైట్ క్రియేట్ చేశాడు. అందులో తనను అఖిల్‌గా పరిచయం చేసుకున్నాడు. అందులో తన కాంటాక్ట్ నెంబర్ ఉంచాడు. అందమైన అమ్మాయిలను సరఫరా చేస్తామని, కావాల్సిన వారు సంప్రదించాలని పేర్కొన్నాడు.

 Online sex racket busted in Visakha, 4 arrested

దాదాపు ఏడు నెలలుగా అతను ఈ దందాను కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతను విశాఖలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. అందులో కంప్యూటర్ ఏర్పాటు చేసుకొని ఓ మహిళ సాయంతో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ ముఠాను నడుపుతున్నాడు.

దీనిపై సమాచారం అందుకున్న ద్వారకా పోలీసులు మంగళవారం ఉదయం దాడి చేశారు. ఈ దాడిలో హైదరాబాదుకు చెందిన నిర్వాహకుడైన నీలకంఠా రెడ్డి, ఆయన వద్ద పని చేస్తున్న ఓ మహిళతో పాటు మరో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+