ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ కోర్సులకు ఆన్ లైన్ శిక్షణ, ఎలా పొందాలంటే..!!
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన రంగాల్లోనూ ప్రభావం చూపుతోంది. ఏఐ ఆధారిత సేవలు ప్రయివేటు వ్యవస్థలలో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ కారణంగా ప్రపంచ స్థాయి దిగ్గజ ఐటీ సంస్థల్లోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల పైన వేటు పడుతోంది. దీంతో, ఏఐ కోర్సులకు పెరుగుతున్న ప్రాధాన్యతకు అనుగుణం గా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు ఆన్ లైన్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.
ఏఐ, ఎంఎల్ కోర్సుల్లో శిక్షణ పొందాలనుకునే వారికి అరుదైన అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ అకాడమీ ద్వారా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏఐ & ఎంఎల్, డేటా సైన్స్ లో పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులకు ఆన్‌లైన్‌లో శిక్షణ, ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ఇంటర్ పాస్, ఇంజినీరింగ్ , డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చ. నేషనల్ స్కిల్ అకాడమీ విద్యార్థులు సరికొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీలలో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.

దరఖాస్తుదారులు ఏఐ & ఎంఎల్, డేటా సైన్స్ లో పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులతో పాటు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల నుండి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. అదనపు కోర్సులలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైన్ కోర్సు లతో పాటు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల నుండి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
కోర్సులు ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. పాస్ అయిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి 10 నెలల వరకు ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు ఫోన్: 9505800050 సంప్రదించాలని సూచించారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications