డైలమాలో దాసరి?: వైసీపీలో చేరతారా లేక టీడీపీలోకా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు.

దీంతో ఏపీలో అటు ప్రతిపక్షం, ఇటు విపక్షాలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలోకి చేరుతున్నారని టీడీపీకి చెందిన నేతలు వాదిస్తుంటే... డబ్బులు, మంత్రి పదవులను ఆశగా ఎరచూపి వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని అధినేత జగన్ విమర్శలు చేశారు.

Also Read: జగన్‌కి 'కాపు' షాక్: బాబుని తక్కువఅంచనా వేశారా?

ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అటు రాజకీయ వేత్తలు, మాజీ రాజకీయ నాయకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తాజా వలసలతో వైయస్సార్ కాంగ్రెస్‌కు మరింతగా నష్టం వాటిల్లనుందా? అంటే అవుననే అంటున్నారు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు హఠాత్తుగా పచ్చ కండువా కప్పుకుని మీడియా ముందు ప్రత్యక్షమవుతున్నారు.

Operation Akarsh: Dasari Narayana Rao is not yet ready to join in YSRCP

దీంతో అధినేత జగన్‌కు సైతం ఏమి చేయాలో పోలుపోని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిపక్ష నేత జగన్ దూకుడుని తగ్గించడంతో పాటు, పార్టీని అస్థిరపరచడంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ వలసలకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.

అయితే ఈ రాజకీయ పరిణామాలు వైసీపీలోకి చేరాలనుకునే మాజీలకు సమస్యగా మారాయనే వార్తలు వస్తున్నాయి. ఇందులో మొదటి వరుసలో ఉన్నది దర్శకుడు దాసరి నారాయణ రావు. గతంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆయన్ని కలుసుకున్న తర్వాత వైసీపీలో చేరేందుకు సుముఖత ప్రకటించారు.

అందుకు మే నెలలో ఆయన జన్మదినం ముహుర్తంగా నిర్ణయించారు. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరిపోతుంటే దాసరి వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? వైసీపీలోకి చేరడం వల్ల ఆయనకు కలిగే ప్రయోజనం ఏంటీ? అనే ఆలోచనలో పడ్డారని విశ్వసనీయ సమాచారం.

నిజానికి వైసీపీలోకి చేరితే దాసరి నారాయణరావుకి వైయస్ జగన్ రాజ్యసభకు పంపిస్తారని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పరిణామాలతో వైసీపీలోకి దాసరి చేరతారా? లేక టీడీపీ గూటికి చేరతారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. అంతేకాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఒక రాజ్యసభ సీటు కోసం రేసులో ప్రస్తుతం మైసూరా రెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి నేతలు ఉన్నారు.

ఈ క్రమంలో వైసీపీలోకి చేరితే జగన్ దాసరికి రాజ్యసభ సీటు ఇస్తారా? లేదా అనేది ప్రశ్నార్ధకంగానే ఉంది. మరోవైపు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+